Share News

శ్రమకు తగ్గ వేతనం అందించాలి

ABN , Publish Date - Apr 13 , 2025 | 11:41 PM

శ్రమదోపిడీని వ్యతిరేకిస్తూ, శ్రమకు తగ్గ వేతనం అందించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని అప్పక్‌పల్లి గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి బైక్‌ యాత్ర నిర్వహించారు.

శ్రమకు తగ్గ వేతనం అందించాలి

- సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్‌ యాత్ర

నారాయణపేట రూరల్‌, ఏప్రిల్‌13 (ఆంధ్రజ్యోతి): శ్రమదోపిడీని వ్యతిరేకిస్తూ, శ్రమకు తగ్గ వేతనం అందించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని అప్పక్‌పల్లి గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి బైక్‌ యాత్ర నిర్వహించారు. ఈ యాత్రను తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి అంజిలయ్యగౌడ్‌ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా కార్యదర్శి బల్‌రాం మాట్లాడుతూ.. ఈనెల 6 నుండి 14వరకు రాష్ట్రంలో సామాజిక న్యాయ సాధన కార్యక్రమం నిర్వహించాలని రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిందన్నారు. జిల్లాలోనిమండల కేంద్రాల్లో కనీస వేతనం రూ.26వేల అమలు కోసం సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం మనువాద సిద్ధంతాన్ని అమలు చేయాలని ప్రయత్నిస్తుందని విమర్శించారు. దేశభక్తి ముసుగులో ప్రజలను కార్మికులను విడదీస్తుందన్నారు. కార్మిక చట్టాలన్నీ మార్చి యజమానులకు అనుకూలంగా నాలుగు లేబర్‌ కోడ్లు తెస్తున్నారన్నారు. దీంతో కార్మిక వర్గం కట్టుబానిసత్వంలోకి వెళ్లే అవకాశముందన్నారు. జిల్లాకేంద్రంలో ఆశావర్కర్లు స్వాగతం పలికారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో జోషి, బాలమణి, కాశీనాథ్‌, డి.కృష్ణయ్య, భీంసేన్‌, భీమేష్‌, మొగులయ్య, నరహరి, పవన్‌కుమార్‌, రాములు, దస్తప్ప, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగాన్ని రక్షించాలి

మక్తల్‌: మనువాదం నశించి రాజ్యాంగం రక్షించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం సీఐ టీయూ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్‌ కూడలి వద్ద బైక్‌ ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఉపా ధ్యక్షుడు ఆంజనేయులు, సహ కార్యదర్శి నర్సిం హులు మాట్లాడుతూ నిచ్చెన మెట్ల కుల వ్యవ స్థకు కారణమైన మనువాదం నశించాలన్నారు. కార్యక్రమంలో భరత్‌కుమార్‌, రాంరెడ్డి, కృష్ణ, నర్సింహ, శివ, అశోక్‌, ఎల్లప్ప, లోకేష్‌, రాము, బాలు, గోవిందు, రాజు పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 11:41 PM