పురాతన చారిత్రక కట్టడాలను కాపాడండి
ABN , Publish Date - Apr 03 , 2025 | 11:38 PM
గద్వా ల జిల్లాలోని పురాతన చారిత్రక కట్టడాలను కా పాడాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు.

అయిజ టౌన్, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి):గద్వా ల జిల్లాలోని పురాతన చారిత్రక కట్టడాలను కా పాడాలని బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు రామచంద్రారెడ్డి అన్నారు. గురువారం అయిజలోని పురాతన కట్టడమైన బక్కమ్మ బాయిని బీజేపీ శ్రేణులతో కలిసి పరిశీలించారు. జిల్లాలోని ని జాంకొండ కోటను, గద్వాల, ప్రాగటూరు మట్టికోటలను, అలంపూర్, రాజోళి, గట్టు, చిన్నతాండ్రపాడు, దేవబండలో రాతి బురుజులను రక్షిం చి పర్యాటక ప్రాంతాలుగా చేయాలని ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీజేపీ అయిజ మండల అధ్యక్షుడు గోపాలకృష్ణ, నాయకులు భీంసేన్‌రావు, శశికుమార్, అబ్దుల్లా, వీర య్యఆచారి, రాజశేఖర్, రామకృష్ణ, నర్సింహ, వీరేశ్, మహేష్, భీముడు, భాస్కర్, అంజి, భీమ న్న, గడిగె రాజశేఖర్, నేష రఘు, వీరేశ్ ఆచారి, రామాచారి పాల్గొన్నారు.