Share News

ఆలయంలో చోరీపై ఫిర్యాదు చేయరా?

ABN , Publish Date - Apr 02 , 2025 | 11:47 PM

జముల మ్మ ఆలయం హుండీ లెక్కింపులో కాంట్రాక్టు ఉద్యోగి రూ.లక్ష చోరీ విషయంపై నేటి వరకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లే దంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఆలయంలో చోరీపై ఫిర్యాదు చేయరా?

- చేతివాటం, అక్రమాలపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న భక్తులు, దాతలు

గద్వాల, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): జముల మ్మ ఆలయం హుండీ లెక్కింపులో కాంట్రాక్టు ఉద్యోగి రూ.లక్ష చోరీ విషయంపై నేటి వరకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లే దంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హుండీ లెక్కింపు రోజే చోరీ విషయం తెలిసిన ప్పటికీ, నాలుగు రోజుల తర్వాత సదరు ఉద్యో గిని పిలిపించి రూ.లక్ష స్వాధీనం చేసుకొన్నా రు. ఆ సందర్బంగా సదరు ఉద్యోగి మా ట్లాడు తూ ఇక్కడ అందరూ దొంగలే.. నేను బయటపడ్డాను అంటూ మాట్లాడడం పలు అనుమా నాలకు తావిస్తోంది. ఆలయంలో ఏమి జరుగుతుంది? పర్యవేక్షించే ఆలయ ఈవో, పాలకవ ర్గం ఆలయంలో జరుగుతున్న సంఘటనలపై ఎందుకు దృష్టి పెట్టడంలేదు? పోలీసుల దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదు? అనే ప్రశ్నలు ఉత్పన్న మవుతున్నాయి. ఫిర్యాదు చేస్తే ఉద్యోగి చెప్పినట్లు అందరూ దొంగలే నిజమౌతుందని భయపడ్డారా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. గతంలో హుండీల లెక్కింపులో కూడా డబ్బులు తీసిన ట్లు అందరూ చర్చించుకుంటున్నారు. ఇవ న్నీ బయట పడకుండా ఉండేందుకే ఫిర్యాదు లేకుండా నేరుగా హుండీలో వేయించారనే అను మానాలు అందరూ దొంగలే అన్న మాటలను బలపరుస్తున్నాయి.

భక్తుల కానుకలకు విలువేది?

జములమ్మ అమ్మవారిని దర్శించుకోవడానికి కర్నాటక, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు. వారు మొక్కుల చెల్లింపులో భాగంగా కానుకలు నేరుగా హుండీలో వేస్తారు. మరికొందరు ఆలయ అధికారులకు అందజేస్తా రు. వారు రశీదును అందిస్తారు. కానీ కొంతమంది భక్తులు అధికారుల వద్దకు వెళ్లకుండా నేరుగా సిబ్బంది వద్దకు వెళ్లి కానుకలు ఇవ్వాల ని చెబితే వారు మేము హుండీలోవేస్తాం అని చెప్పి నొక్కేసిన సంఘటనలు ఉన్నాయి. అధికారులు లేకుండానే బంగారు కానుకలను స్వీకరించిన సందర్బాలున్నాయి. అయినా వీటిపై అధికారులు మౌనంగాఉండడం గమనార్హం. ఆలయ అభివృద్ధి కోసం ఇప్పటివరకు దాతల నుంచి అందిన విరాళాల గురించి అడిగితే, ఆలయ అధికారులు మాకు సంబంధంలేదని అంటున్నా రు. దీంతో విరాళాలకు విలువలేకుండా పోయిందని దాతలు బాధను వ్యక్తం చేస్తున్నారు.

విధులు నిర్వహించని అధికారులు, సిబ్బంది

అమ్మవారి దర్శనానికి మంగళవారం, శుక్రవారం భక్తులు అధికంగా వస్తారు. మొక్కులు చె ల్లిస్తారు. మిగిలిన రోజుల్లో నామమాత్రంగా ఉంటారు. ఆలయంలో ఈవోతో పాటు ఐదు మంది రెగ్యులర్‌ ఉద్యోగులు, ఎనిమిది మంది కాంట్రాక్ట్‌ ఉద్యోగులు, ఐదుగురు మేతర్లు, ఇద్ద రు స్వీపర్లు విధులు నిర్వహించాల్సి ఉంది. మం గళ, శుక్రవారాలలో మాత్రమే వీరు విధులు నిర్వహిస్తారు. మిగిలిన రోజుల్లో అక్కడ వంతులవారీగా ఇద్దరు మాత్రమే విధుల్లో ఉంటారు. మిగిలిన వారు వారి సొంత కార్యకలాపాలలో ఉంటారు. ఇలాంటి సమయంలోనే అనేక సంఘటనలు అక్కడ జరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆలయ ఈవో పురేందర్‌ కుమార్‌ ఇక్కడి వ్యవహారాలపై దృష్టి పెట్టకపోవడం కూడా సిబ్బందికి అలుసుగా మారింది.

Updated Date - Apr 02 , 2025 | 11:47 PM