పూలతేరుపై శ్రీరామచంద్రుడు
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:34 PM
నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ మండలం లోని సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి.

- రామనామ స్మరణతో మార్మోగిన సిరసనగండ్ల
- స్వామి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు
- నేడు పెద్ద రథోత్సవం
చారకొండ, ఏప్రిల్ 8 (ఆంధ్రజ్యోతి) : నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ మండలం లోని సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం తె ల్లవారుజామున పూలతేరు (చిన్న రథం) ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల శ్రీరామనామ స్మరణతో ఆలయ పరి సరాలు మార్మోగాయి. ముందు ఆలయ చైర్మన్ ఢేరం రామశర్మ, ఈవో ఆంజనేయు లు ఆధ్వర్యంలో చిన్న రథాన్ని పూలు, మామిడి తోరణాలతో అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రథంలో ఉంచి పూజలు చేశారు. అనంతరం భక్తులతో కలిసి రథాన్ని లాగారు. అధిక సం ఖ్యలో తరలివచ్చిన భక్తులు రథోత్సవం లో పాల్గొని, అనంతరం సీతారామచంద్ర స్వా మిని దర్శించుకొని పూజలు చేశారు. అలాగే క్షేత్రంలోని శివదత్తాత్రేయ, పరశు రాముడు, ముక్కిడి పోచమ్మతల్లి, గుట్ట దిగువన కొలువైన మైసమ్మతల్లిని దర్శించుకొని నైవేద్యాలు సమర్పించి మెక్కులు తీర్చుకున్నారు. రాత్రి స్వామి వారికి గరుడ సేవ నిర్వహించారు. బుధవారం రాత్రి నిర్వహించనున్న పెద్దర థం (బ్రహ్మోత్సవం) ఊరేగింపు గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగుతుందని ఆలయ చైర్మన్ ఢేరం రామశర్మ తెలిపారు. ఆలయ మేనేజర్ నిరంజన్, ఆలయ పూజారులు ఢేరం మురళీధరశర్మ, ఢేరం లక్ష్మణశర్మ, ఢేరం వేణుశర్మ, ఢేరం ఆనందశర్మ, ఢేరం గోపిశర్మ, ఢేరం భాస్కరశర్మ, ఢేరం ప్రవీణ్ శర్మ పాల్గొన్నారు.