విద్య అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే
ABN , Publish Date - Apr 08 , 2025 | 11:11 PM
రాష్ట్రంలో ప్రతీ బడుగు, బలహీన వర్గాల పిల్లలకు విద్య అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గూడెబల్లూరు గ్రామలో మంగళవారం నిర్వహించిన మార్గదర్శి పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్
కృష్ణ, ఏప్రిల్8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతీ బడుగు, బలహీన వర్గాల పిల్లలకు విద్య అందేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు. నారాయణపేట జిల్లా కృష్ణ మండలం గూడెబల్లూరు గ్రామలో మంగళవారం నిర్వహించిన మార్గదర్శి పాఠశాల వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అంగన్‌వాడీ కేంద్రాల టీచర్లకు జీత భత్యాలు సరిగా అందక పిల్లలకు ఆశించిన స్థాయిలో విద్య అందడం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాల్సి ఉందన్నారు. బడ్జెట్‌లో విద్యకు 15 శాతం నిధులు కేటాయించాలన్నారు. ప్రైవేటు పాఠశాలలకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సహకారం లేదన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు పెట్టడానికి ఆలోచన చేయాలన్నారు. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల బలోపేతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో గెలుపొందిన విద్యార్థులకు బండ ప్రకాష్, వాకిటి శ్రీహరి బహుమతులను అందించారు. కార్యక్రమంలో ఎంఈవో నిజాముద్దీన్, యాజమాన్యం, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు.