పనులు నాణ్యతగా చేపట్టాలి
ABN , Publish Date - Apr 15 , 2025 | 11:26 PM
రోడ్డు విస్తరణ పనులను నాణ్యతగా చేపట్టాలని ఆర్‌అండ్‌బీ డీఈ రాములు సిబ్బందికి సూచించారు.

- ఆర్‌అండ్‌బీ డీఈ రాములు
- రోడ్డు విస్తరణ పనులను పరిశీలించిన డీఈ
కొత్తపల్లి, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి): రోడ్డు విస్తరణ పనులను నాణ్యతగా చేపట్టాలని ఆర్‌అండ్‌బీ డీఈ రాములు సిబ్బందికి సూచించారు. కొడంగల్ నియోజకవర్గంలోని కొత్తపల్లి నుంచి లింగాల్‌చేడ్ వరకు వేస్తున్న డబుల్ బీటీ రోడ్డు పనులను ఆయన కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. అల్లీపూర్ నుంచి మ న్నాపూర్ గ్రామానికి బీటీ లేక రవాణా సౌకరా నికి ప్రజలు, ప్రయాణికులు ఇబ్బంది పడేవారని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. సీఎం చొరవతో గ్రామాలకు బీటీ రోడ్లు మంజూరయ్యాయని వారు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొట్ల మహీందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, మద్దూరు పీఏసీఎస్ అధ్యక్షుడు నర్సిములు, జడ్పీటీసీ మాజీ సభ్యుడు రఘుపతిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ భీములు తదితరులున్నారు.