రోడ్డు వేశారు.. డ్రైనేజీ నిర్మాణాన్ని మరిచారు
ABN , Publish Date - Apr 03 , 2025 | 10:56 PM
మునిసిపాలిటీ పరిధిలోని 15వ వార్డు మంగళి వీధిలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది.

- ప్రమాదభరితంగా మారిన డ్రైనేజీ గుంత
- ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని స్థానికుల భయాందోళన
కోస్గి, ఏప్రిల్ 3 (ఆంధ్రజ్యోతి): మునిసిపాలిటీ పరిధిలోని 15వ వార్డు మంగళి వీధిలో డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారింది. ఆరునెలల క్రితం రోడ్డు అస్తవ్యస్తంగా ఉందని ‘ఆంధ్రజ్యోతి’లో కథనం రావడంతో నాయకులు, అధికారులు కదిలారు. వెంటనే రోడ్డు వేశారు. కానీ డ్రైనేజీ నిర్మాణాన్ని మరిచిపోయారు. దీంతో ఆ వీధి గుండా వెళ్లే దారిలో బొడ్రాయి వద్ద డ్రైనేజీ పెద్ద లోయలా మారి వాహనదారులకు భయాందోళన కలిగిస్తోంది. దీనివల్ల ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులతో పాటు, స్థానికులు బిక్కుబిక్కుమంటున్నారు. డ్రైనేజీ నిర్మాణం చేపట్టాలని వార్డు ప్రజలు అధికారులు, ప్రజాప్రతినిధులకు చెప్పినా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా మునిసిపల్ అధికారులు స్పందించి డ్రైనేజీ నిర్మాణం చేయాలని వారు కోరు తున్నారు.