సన్నబియ్యంతో వండిన అన్నం తినేందుకు వస్తాం
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:17 PM
నిరుపేదలు కడుపు నిండా తినాలనే ఉద్ధేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందించేందుకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు.

- ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి
- నిరుపేదలు కడుపు నిండా తినాలనే సన్న బియ్యం పంపిణీ
- సన్నరకం వరికి రూ.500 బోనస్ ఇచ్చి రైతాంగానికి చేయూత
- జిల్లాలోని రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ
నారాయణపేట/ధన్వాడ/ దామరగిద్ద/మరికల్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): నిరుపేదలు కడుపు నిండా తినాలనే ఉద్ధేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం అందించేందుకు శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి అన్నారు. సోనా బియ్యంతో వండిన అన్నం భుజించేందుకు మహిళల ఇళ్లకు త్వరలో కలెక్టర్‌తో కలిసి వస్తామని పేర్కొన్నారు. మంగళవారం నారాయణపేటలోని అశోక్‌నగర్ తో పాటు మండలంలోని పేరపళ్ల గ్రామంలోని రేషన్ దుకాణంలో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ చేశారు. అశోక్‌నగర్‌లో జరిగిన సమా వేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇదివరకు రేషన్ దుకాణాల్లో ఇస్తున్న దొడ్డు బియ్యం తినకపోగా వాటిని పక్కదారి పట్టించారని అన్నారు. రైతాంగం పండించిన సన్నరకం ధాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాల్ వెంట రూ.500 బోనస్ ఇచ్చి అండగా నిలుస్తున్నామన్నారు. కార్యక్ర మంలో మార్కెట్ చైర్మన్ సదాశివారెడ్డి, అదనపు కలెక్టర్ సంచిత్‌గంగ్వార్, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ సైదులు, అధికారి బాల్‌రాజ్, కాంగ్రెస్ నాయకులు హరినాయణభట్టడ్, గందె చంద్రకాంత్, బండి వేణుగోపాల్, ఎండీ.సలీం, సాయిబాబ, సుధాకర్, మహేష్, కోట్ల రవి, అఖిల్‌రెడ్డి, వెంకుగౌడ్, సంతోష్, మల్లేష్, మా రుతి, బండి రాజేశ్వరి, శరణప్ప, రమేష్, మనోజ్, వినోద్, కార్తీక్, హర్షవర్ధన్ తదితరులున్నారు.
అదేవిధంగా, ధన్వాడలోని కోటపక్కాలో బాబా డీలర్ షాపు వద్ద ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి రేషన్ కార్డుదారులకు మంగళవారం సన్న బియ్యాన్ని అందించారు. తన పదవీ కాలంలో మండలంలో అన్ని అభివృద్ధి పనులు చేసి ముందుకు తీసుకెళ్తానన్నారు. తహసీల్దార్ సింధూజ, మార్కెట్ యార్డు డైరెక్టర్లు జట్రం లక్ష్మయ్యగౌడ్, నీరటి రాంచంద్రయ్య ముదిరాజ్, ఊసు బాల కృష్ణ, చీరాల సుధాకర్‌రెడ్డి, రహిమన్‌ఖాన్, యు వజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జేసీబీ రాజు, జుట్ల ఆనంద్‌గౌడ్, షాకీర్‌హుస్సేన్ తది తరులున్నారు.
దామరగిద్ద మండల కేంద్రంలోని కుపేందర్ రేషన్ దుకాణంలో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి స్థానిక నాయకులతో కలిసి సన్న బియ్యం పంపిణీ చేశా రు. తెలంగాణ ప్రజా ప్రభుత్వం అందిస్తున్న ప థకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో విండో చైర్మన్ పుట్టి ఈదప్ప, సివిల్ సప్లై అధికారులు, డీఎస్‌వో బాల్‌రాజ్, డీఎం సీఎస్ సైదులు, డీటీలు ఆనంద్, కాళప్ప, నాగరాజ్, ఉప తహసీల్దార్ ప్రవీణ్ కుమార్, జూనియర్ అసిస్టెంట్, ఆంజనేయులు, రేషన్ డీలర్లు, నాయకులు పాల్గొన్నారు.
మరికల్ మండల కేంద్రంలోని హరిజనవాడ రేషన్ దుకాణంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి మంగళవారం సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సన్నరకం వరికి రూ.500ల బోనస్‌తో ధాన్యం ఉత్పత్తి గణనీయం గా పెరిగిందన్నారు. కార్యక్రమంలో పేట మార్కె ట్ చైర్మన్ సదాశివారెడ్డి, జిల్లా నాయకుడు సూ ర్యమోహన్‌రెడ్డి, రాజమణమ్మ, వీరన్న, హరీశ్, ఎల్.రాములు, రామకృష్ణ, మల్లారెడ్డి, బసిరెడ్డి, సంజీవరెడ్డి, డాక్టర్ ఇస్మాయిల్, ఖాజా, చందా హుసేన్ తదితరులున్నారు.
పేదల అభివృద్ధే కాంగ్రెస్ ధ్యేయం
మక్తల్ : పేదల అభివృద్ధే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి అన్నారు. మంగళవారం మక్తల్ పట్టణంలోని నెహ్రూగంజ్‌లో రేషన్ దుకాణం వద్ద ఆయన కార్డుదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో ఎక్కడా పేద ప్రజలకు సన్నం బియ్యం అందించలేదన్నారు. తమ ప్రభుత్వం పేదల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పిస్తూ సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చు ట్టిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తుందన్నారు. కాం గ్రెస్ నాయకులు గవినోళ్ల బాలకృష్ణారెడ్డి, లక్ష్మా రెడ్డి, గణేష్‌కుమార్, కట్ట సురేష్‌కుమార్‌గుప్తా, కావలి ఆంజనేయులు, కావలి తాయప్ప, కల్లూరి గోవర్దన్, రవికుమార్, పుర కమిషనర్ శంకర్ నాయక్, చంద్రశేఖర్, అమర్, అమరేందర్, సీఐ రాంలాల్, ఎస్‌ఐ భాగ్యలక్ష్మీరెడ్డి ఉన్నారు.