మందా జగన్నాథం అంత్యక్రియలు పూర్తి
ABN, Publish Date - Jan 14 , 2025 | 04:17 AM
మాజీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముగిశాయి. చంపాపేటలోని ఆయన నివాసం నుంచి సైదాబాద్
అధికారిక లాంఛనాలతో నిర్వహించిన ప్రభుత్వం
సైదాబాద్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): మాజీ ఎంపీ మందా జగన్నాథం అంత్యక్రియలు సోమవారం సాయంత్రం ముగిశాయి. చంపాపేటలోని ఆయన నివాసం నుంచి సైదాబాద్ దోబీఘాట్ శ్మశానవాటిక వరకు ఆయన పార్థివ దేహానికి అంతిమయాత్ర నిర్వహించి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు పూర్తి చేశారు. తన అభిమాన నేతను కడసారి చూసేందుకు మంత్రులు, రాజకీయ, ప్రజాసంఘాల నేతలతోపాటు అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతిమ యాత్రలో మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, పైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, మాజీ ఎంపీలు మధుయాష్కీ గౌడ్, పోతుగంటి రాములు, మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, గువ్వల బాలరాజు, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ పాల్గొని పాడె మోశారు.
సిరిసిల్ల రాజయ్య డప్పు కొట్టారు. కాగా, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మందా జగన్నాఽథం బౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. తెలంగాణ ఉద్యమంలో, బీఆర్‌ఎస్ పార్టీకి మందా జగన్నాథం చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. వివాదరహితుడు, సౌమ్యుడు, తెలంగాణ మేలు కోరుకున్న వ్యక్తి అని అన్నారు. మహబూబ్‌నగర్ అభివృద్ధిని మందా జగన్నాథం ఆకాంక్షించారని వివరించారు. మందా జగన్నాథం పార్టీవ దేహానికి మంత్రి దామోదరం రాజనర్సింహ, మాజీ ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యే నారాయణరెడ్డి, బీఆర్‌ఎస్ నేత ప్రవీణ్‌కుమార్ నివాళులర్పించారు.
Updated Date - Jan 14 , 2025 | 04:17 AM