Share News

Maoists: కర్రెగుట్టల చుట్టూ బాంబులు పెట్టాం

ABN , Publish Date - Apr 09 , 2025 | 05:35 AM

తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలపైకి ప్రజలెవరూ రావొద్దని, ఆపరేషన్‌ కగార్‌ పేరుతో జరుగుతున్న దాడుల నుంచి స్వీయ రక్షణ కోసం గుట్ట చుట్టూ బాంబులు పెట్టామని మావోయిస్టులు ఓ ప్రకటనలో హెచ్చరించారు.

Maoists: కర్రెగుట్టల చుట్టూ బాంబులు పెట్టాం

  • గుట్టలపైకి ఎవరూ రాకండి.. మావోయిస్టుల హెచ్చరిక

  • ఆపరేషన్‌ కగార్‌ నుంచి స్వీయ రక్షణ కోసమేనని వెల్లడి

ములుగు, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దుల్లో ఉన్న కర్రెగుట్టలపైకి ప్రజలెవరూ రావొద్దని, ఆపరేషన్‌ కగార్‌ పేరుతో జరుగుతున్న దాడుల నుంచి స్వీయ రక్షణ కోసం గుట్ట చుట్టూ బాంబులు పెట్టామని మావోయిస్టులు ఓ ప్రకటనలో హెచ్చరించారు. మావోయిస్టు పార్టీ వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరిట లేఖను విడుదల చేశారు. ములుగు జిల్లా పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలను కలుపుతూ కర్రెగుట్టలు ఛత్తీ్‌సగడ్‌లోకి విస్తరించి ఉన్నాయి. దట్టమైన అడవులున్న ఈ ప్రాంతాన్ని మావోయిస్టులు గెరిల్లా బేస్‌గా మార్చుకున్నారని పోలీసు ఉన్నతాధికారులు గతంలో వెల్లడించారు. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాను కలిపే ఈ గుట్టల్లో పోలీసులు, మావోయిస్టుల చర్యలు, ప్రతిచర్యలతో నిత్యం అలజడిగా ఉంటుంది. ఇటీవల ఛత్తీ్‌సగఢ్‌లో ఎన్‌కౌంటర్లు పెరిగిన నేపథ్యంలో మావోయిస్టులు తెలంగాణలోకి ప్రవేశించడానికి ఈ అడవే మార్గం. ఈ క్రమంలోనే మావోయిస్టుల పేరిట విడుదలైన లేఖ చర్చనీయాంశంగా మారింది. కాగా, గత నెల 23న వెంకటాపురం మండలం ఇప్పగూడేనికి చెందిన కృష్ణమూర్తి ముత్యంధార జలపాతం సమీపంలో అడవిలోకి వెళ్లగా ప్రెషర్‌ బాంబు పేలి తీవ్రంగా గాయపడ్డాడు. అంతకుముందు వాజేడు మండలం జగన్నాఽథపురానికి చెందిన ఇల్లందుల ఏసు బాంబు పేలి మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలపై ఏనాడూ స్పందించని మావోయిస్టులు.. కర్రెగుట్టల చుట్టూ తాము మందుపాతరలు అమర్చామని తాజాగా తొలిసారి ప్రకటించారు. స్థానిక ప్రజలెవరూ పోలీసుల మాటలను నమ్మి మోసపోవద్దని, కర్రెగుట్టలపైకి రావొద్దని హెచ్చరించారు.


కర్రెగుట్టలపై తనిఖీలు

కర్రెగుట్టల వద్ద భద్రతా చర్యలను పటిష్టం చేస్తున్నామని, బాంబు డిస్పోజల్‌ టీమ్‌లతో తనిఖీలు నిర్వహిస్తున్నామని ములు గు జిల్లా ఎస్పీ శబరీశ్‌ తెలిపారు. సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎవరికైనా బాం బుల ఆనవాళ్లు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి..

సింహానికి చుక్కలు చూపించిన తేనెటీగలు..

సిట్‌ కస్టడీకి ‘కల్తీ నెయ్యి’ నిందితులు

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Read More Latest Telugu News Click Here

Updated Date - Apr 09 , 2025 | 05:35 AM