Share News

Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌!

ABN , Publish Date - Feb 06 , 2025 | 04:56 AM

మస్తాన్‌ సాయి కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగులోకి వస్తోంది. విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. మహిళల వ్యక్తిగత వీడియోలు సేకరించి, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మస్తాన్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.

Mastan Sai: మస్తాన్‌కు డ్రగ్స్‌ టెస్ట్‌లో పాజిటివ్‌!

  • అతని స్నేహితుడు ఖాజాకు కూడా.. ఇద్దరిపై ఎన్‌డీపీఎ్‌స కేసు

  • వారాంతాల్లో మస్తాన్‌ ఇంట్లో డ్రగ్స్‌ పార్టీలు

  • అక్కడ మహిళలపై లైంగిక దాడి.. నగ్న వీడియోలు

  • లావణ్య వీడియోలను డిలీట్‌ చేయించిన రాజ్‌తరుణ్‌

  • హార్డ్‌డిస్క్‌ కోసం ఆమెను హతమార్చేందుకు మస్తాన్‌ యత్నం

  • రిమాండ్‌ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించిన పోలీసులు

హైదరాబాద్‌ సిటీ, ఫిబ్రవరి 5 (ఆంధ్రజ్యోతి): మస్తాన్‌ సాయి కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగులోకి వస్తోంది. విస్తుగొలిపే విషయాలు బయటపడుతున్నాయి. మహిళల వ్యక్తిగత వీడియోలు సేకరించి, బెదిరింపులకు పాల్పడుతున్నారనే ఆరోపణలతో మస్తాన్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మస్తాన్‌తో పాటు అరెస్టయిన ఖాజాకు పోలీసులు డ్రగ్స్‌ పరీక్షలు చేశారు. ఇద్దరికీ పాజిటివ్‌ రావడంతో వారిపై ఎన్‌డీపీఎస్‌ యాక్ట్‌ కింద కేసు నమోదు చేశారు. రిమాండు రిపోర్టులో పలు విషయాలను వెల్లడించారు. మస్తాన్‌ సాయితో పాటు ఆర్‌జే శేఖర్‌ బాషాపై లావణ్య బుధవారం నార్సింగి పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. అసలు లావణ్యకు, మస్తాన్‌ సాయికి ఎలా పరిచయం ఏర్పడింది? లావణ్యను కేసులో ఇరికించేందుకు మస్తాన్‌ సాయి, ఆర్‌జే శేఖ ర్‌ బాషా ఎందుకు యత్నించారు? అన్న విషయాలపై పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టారు.


ఫంక్షన్‌కు వెళ్లిన లావణ్య వీడియోలు తీసి..

మస్తాన్‌ రిమాండు రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. ఉనీత్‌రెడ్డి అనే స్నేహితుడి ద్వారా మస్తాన్‌ సాయితో లావణ్యకు పరిచయమైంది. ఓ ఫంక్షన్‌కు మస్తాన్‌ ఇంటికి వెళ్లిన లావణ్య.. దుస్తులు మార్చుకుంటున్న సమయంలో వీడియో తీశాడు. వాటిని మస్తాన్‌ తన స్నేహితులకు కూడా పంపినట్లు రిపోర్టులో తెలిపారు. విషయం తెలిసిన లావణ్య.. అతనితో గొడవకు దిగింది. అప్పట్లో రాజ్‌తరుణ్‌ ఈ విషయంలో రాజీ చేసినట్లు పేర్కొన్నారు. మస్తాన్‌ వద్ద ఉన్న వీడియోలను రాజ్‌తరుణ్‌ డిలీట్‌ చేయించారు. కానీ, అప్పటికే ఆ వీడియోలను మస్తాన్‌ మరో హార్డ్‌ డిస్క్‌లో భద్రపర్చాడు. ఆ డిస్క్‌ను 2024 నవంబరులో లావణ్య తన ఇంటికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి మస్తాన్‌.. లావణ్యను చంపించేందుకు ప్రయత్నిస్తున్నాడని పోలీసులు తెలిపారు. మస్తాన్‌ని కస్టడీలోకి తీసుకునేందుకు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు.


హార్డ్‌ డిస్క్‌లో నగ్న వీడియోలు..

మస్తాన్‌ తన ఇంట్లో ప్రతి శని, ఆది వారాల్లో డ్రగ్స్‌ పార్టీలు నిర్వహించేవాడని పోలీసులు చెబుతున్నారు. ఆ పార్టీల్లో డ్రగ్స్‌ తీసుకున్న వారిలో కొందరిని టార్గెట్‌ చేసుకొని, రహస్యంగా నగ్న వీడియోలను రికార్డు చేసి హార్డ్‌డి్‌స్కలో భద్రపర్చుకున్నట్లు గుర్తించారు. మత్తులోకి జారుకున్న తర్వాత అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడేవాడని, అప్పుడు తీసిన వీడియోలతో బెదిరించి.. వారిని లోబర్చుకునేవాడని లావణ్య ఇచ్చిన ఫిర్యాదులోనూ పేర్కొంది.


సోషల్‌ మీడియాలో ఆడియో టేపులు వైరల్‌

లావణ్య, మస్తాన్‌కు సంబంధించిన ఆడియో టేపులు సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఒక ఆడియో టేపులో మస్తాన్‌, ఆర్‌జే శేఖర్‌బాషాలు కలిసి లావణ్యను డ్రగ్స్‌ కేసులో ఇరికించాలని పథకం వేసిన సంభాషణలుండగా, దీన్ని లావణ్య పోలీసులకు ఇచ్చింది. అలాగే లావణ్య, చింటూ, మరో యు వతి కలిసి శేఖర్‌బాషాపై కక్ష తీర్చుకోవాలంటూ మా ట్లాడిన సంభాషణలు ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి.

Updated Date - Feb 06 , 2025 | 04:56 AM