Harish Rao : సీఎం రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి హరీష్ రావు సవాల్
ABN, Publish Date - Jan 26 , 2025 | 08:00 PM
Harish Rao : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్దాలు ఆడుతోన్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తడి బట్టలతో కురుమూర్తి ఆలయానికి రావాలంటూ ఆయనకు హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు.

గజ్వేల్, జనవరి 26: మహబూబ్‌నగర్ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అబద్దాలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది నిజమో.. కాదో తెలుసుకొనేందుకు తడి బట్టలతో ఇద్దరం కురుమూర్తి దేవాలయానికి పోదాం.. వస్తావా? అంటూ సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే హరీష్ రావు బహిరంగ సవాల్ విసిరారు.
ఆదివారం గజ్వేల్‌లో హరీష్ రావు మాట్లాడుతూ.. 20 ఏళ్లలో కాంగ్రెస్, టీడీపీలు కల్వకుర్తి, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పెండింగ్‌లో పెట్టి 26 వేల ఎకరాలకే నీళ్లిచ్చారని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్ కేబినెట్‌లో నీటి పారుదల శాఖ మంత్రిగా తాను బాధ్యతలు చేపట్టి.. మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రాజెక్టుల వద్దే నిద్ర పోయి.. కష్టపడి 6 లక్షలకుపైగా ఎకరాలకు నీళ్లి ఇచ్చామన్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు అన్యాయం చేసింది తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు.
మహబూబ్‌నగర్ జిల్లాలోని పొలాల్లో కృష్ణా జలాలు పారించింది కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ అని హరీష్ రావు బల్లగుద్దీ చెప్పారు. ఆనాడు ఏ దరఖాస్తు లేకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇయ్యలేదా..? అని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి నిలదీశారు. 11 విడతల్లో రూ.73 వేల కోట్ల నగదును కేసీఆర్.. రైతు బంధు పథకం కింద అందజేశారన్నారు.
ఇక 13 లక్షల మందికి రూ. లక్ష చొప్పున కళ్యాణ లక్ష్మీ ఇచ్చామని చెప్పారు. ఏ దరఖాస్తు లేకుండా 57 ఏళ్లకే ఆసరా పెన్షన్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌దని గుర్తు చేశారు. ఎంత సేపు ప్రతిపక్షాలను తిట్టుడు.. కేసీఆర్‌ను తిట్టుడు తప్పా రేవంత్ రెడ్డికి పాలన చాత కాదని మండిపడ్డారు. అప్పుడేమో దేవుళ్ల మీద ఒట్టు పెట్టి ముక్కోటి దేవుళ్లను మోసం చేశాడంటూ సీఎం రేవంత్‌పై హరీష్ రావు విరుచుకుపడ్డారు. ఇటీవల గణతంత్ర దినోత్సవం సాక్షిగా అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి.. మళ్ళీ కొందరికే అని ఈ రోజున బీఆర్ అంబేద్కర్‌ను సైతం సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు.
Also Read: న్యూఢిల్లీలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలోని గజ్వేల్ ప్రజ్ఞపూర్ మున్సిపల్ పాలకవర్గం అభినందన సభలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు మాట్లాడుతూ.. ఈ ఐదేళ్లలో గజ్వేల్ దశ దిశ మారిందన్నారు. గజ్వేల్ చరిత్రలో మీ పేరు శాశ్వతంగా నిలిచిపోతుందంటూ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లను ఆయన అభినందించారు. ఈ కాలంలో సాగు నీరే కాదు తాగు నీరు సైతం గజ్వేల్‌కు వచ్చిందని చెప్పారు.
Also Read: ఎవరు ఎన్ని కుట్రలు చేసినా..
హైదరాబాద్ తర్వాత గజ్వేల్‌కు రింగు రోడ్డు.. అది కూడా ఆరు లైన్ల రింగు రోడ్డు రావడం చిన్న విషయం కాదన్నారు. గతంలో ఇడుపు కాగితాలను వేదికైన పాండవుల చెరువు.. ఈ రోజు పిల్లా పాపలతో కలకళలాడుతుందని పేర్కొన్నారు. ఒక అద్భుతమైన టూరిజం కేంద్రంగా అభివృద్ధి చెందిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. గజ్వేల్ ప్రస్తుతం జిల్లా కేంద్రంగా ఉందని.. ఇక్కడికి జిల్లా ఆసుపత్రి, రైలు సైతం వచ్చాయన్నారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలకు కేంద్రంగా గజ్వేల్ అభివృద్ధి చెందిందన్నారు. ఈ విధంగా గజ్వేల్ దశ దిశ మార్చిన కేసీఆర్ నాయకత్వంలో కౌన్సిలర్లుగా పని చేయడం.. మీ అందరి అదృష్టమంటూ వారిపై పొగడ్తల వర్షం కురిపించారు.
Also Read: అసహనానికి పరాకాష్ట.. కేటీఆర్
Also Read : పద్మ పురస్కారంపై స్పందించిన బాలయ్య బాబు
ఎంత పని చేసినా ఇంకా కొంత మిగిలే ఉంటుందని.. ఇది ప్రజలకు కొరత ఉంటుందన్నారు. ఈ ఏడాది కాలంలో.. కాంగ్రెస్ పాలనలో ఒక్క పనైనా జరిగిందా.?! అంటూ స్థానికులను ఆయన సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది... పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి బంద్ అయిపోయిందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని.. తొలుత ప్రజాపాలన దరఖాస్తు అన్నారని.. మొన్ననేమో కుల గణన పేరు మీద సర్వే అని దరఖాస్తులు పెట్టించారన్నారు.
Also Read: అరిటాకులో భోజనం చేయడం వల్ల ఇన్ని లాభాలున్నాయా..?
Also Read: కోట్లు ఖర్చు పెట్టి.. కూలిపోయే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించిన కేసీఆర్
ఇప్పుడేమో గ్రామసభల పేరు మీద మళ్లీ దరఖాస్తులు అంటున్నారని.. అప్లై.. అప్లై.. నో రిప్లై అన్నట్లుగా అయిపోయిందంటూ ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని గుర్తు చేశారు. అనాడు ఏ దరఖాస్తు లేకుండా కేసీఆర్ సంక్షేమ పథకాలు ఇయ్యలేదా..?! అని ప్రశ్నించారు. కేసీఆర్ పేరు తీయకుండా ఒక్క ఉపన్యాసం అన్న ఇచ్చావా?.. దావోస్ పోతే కూడా నీకు కేసీఆర్ యాది కోస్తున్నాడా ! అంటు రేవంత్ రెడ్డికి హరీష్ రావు చురకలంటించారు.
For Telangana News And Telugu News
Updated Date - Jan 26 , 2025 | 08:00 PM