Share News

విద్యాభివృద్ధికే నా తొలి ప్రాధాన్యం

ABN , Publish Date - Apr 12 , 2025 | 11:22 PM

ఈ ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధికే తన తొలి ప్రాధాన్యమని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామో దర్‌రెడ్డి అన్నారు.

విద్యాభివృద్ధికే నా తొలి ప్రాధాన్యం
లప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాల ఫేర్‌వెల్‌ పార్టీలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి

నాగర్‌కర్నూల్‌టౌన్‌, ఏప్రిల్‌12 (ఆంధ్రజ్యోతి) : ఈ ప్రాంతంలో విద్యారంగం అభివృద్ధికే తన తొలి ప్రాధాన్యమని ఎమ్మెల్సీ కూచకుళ్ల దామో దర్‌రెడ్డి అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాల ఫేర్‌వెల్‌ పార్టీకి ముఖ్య అతిఽథిగా ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభిం చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఫేర్‌వెల్‌ వేడుకలు విద్యార్థుల మధ్య అనుబం ధాన్ని పెంపొందిస్తాయన్నారు. విద్యార్థులు బా గా చదువకుని అధ్యాపకులకు, తల్లిదండ్రు లకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ సైన్స్‌ డిగ్రీ కళాశాల అభివృద్దికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని హా మీ ఇచ్చారు. అనంతరం వివిధ స్తాయిలో చదువులో ఉత్తమ ప్రతీభ కనబరిచిన విద్యా ర్థులకు గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌ను ప్రధానం చేసి ఎమ్మెల్సీ అభినందించారు. అదనంతరం విద్యా ర్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిం చారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ ఎం.అంజయ్య, అడ్మినిస్ట్రేటీవ్‌ అధికారి మహ్మద్‌ ఇర్ఫాన్‌, అధ్యాపకులు మదన్మోహన్‌, వనిత, ఉమాదేవి, కోదండరాములు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2025 | 11:23 PM