జిల్లాలో అశ్వగంధం సాగు
ABN , Publish Date - Apr 02 , 2025 | 12:50 AM
ఆయుర్వేదం అనగానే గుర్తుకు వచ్చే మొక్కల్లో అశ్వగంఽధం మొదటివరసలో ఉంటుంది.ఈ మొ క్క సాగు వివరాలు అందరికీ తెలియదు.

రాష్ట్రంలో మొదటిసారి కోటపహాడ్‌లోనే
హైదరాబాద్ నేషనల్ మెడికల్ ప్లాంట్ సహకారంతోనే
మొదటిసారి సాగుచేస్తున్న ఏడుగురు రైతులు
ఆయుర్వేదం అనగానే గుర్తుకు వచ్చే మొక్కల్లో అశ్వగంఽధం మొదటివరసలో ఉంటుంది.ఈ మొ క్క సాగు వివరాలు అందరికీ తెలియదు. రాష్ట్రంలో నే మొదటిసారిగా అశ్వగంధం సాగుకు ఆత్మకూరు(ఎస్) మండలం కోటపహాడ్ రైతులు ముందుకొచ్చారు. గత డిసెంబరులో గ్రామానికి చెందిన ఏడుగురు రైతులు ఎకరం చొప్పున సాగును ప్రా రంభించారు. ఉచిత విత్తనాలు, కొనుగోలు, మా ర్కెటింగ్ హామీతో సాగుకు ముందుకొచ్చారు. డిసెంబరులో సాగు మొదలుపెట్టగా మరో నెలరోజుల్లో పంట చేతికి వస్తుందని రైతులు చెబుతున్నారు.
- (ఆంధ్రజ్యోతి-ఆత్మకూరు(ఎస్)
కోటపహాడ్ గ్రామానికి చెందిన రైతులు కొచ్చర్ల ముత్యాలు, లింగారెడ్డి,జాల శ్రీను, బాల్నె రాములు, ఒంగేటి మైసిరెడ్డి, భూక్య నగేష్, బాణోత సైదాలు ఎకరం చొప్పున అశ్వగంధం సాగు చేస్తున్నారు. సాధారణంగా జూన, ఆగ స్టులో సాగు ప్రారంభిస్తే అక్టోబరు, నవంబరు నాటికి, యాసంగి సీజన అక్టోబరు, నవంబరులో ప్రారంభిస్తే మార్చిలో పంట చేతికి వస్తుందని రైతులు తెలిపారు. అశ్వగంధం మొక్కల కంటే వేర్లకు మార్కెటింగ్ ఉంటుందని, క్వింటా అశ్వగంధం వేర్లకు మార్కెట్‌లో రూ.25వేలకు పైగా ధర పలుకుతుండగా తెలిపారు. ఆకులు, కాడలు, పువ్వులను సైతం విక్రయిస్తారని తెలిపారు.
నీటి కొరతతో దిగుబడి తగ్గే అవకాశం
కోటపహాడ్‌కు చెందిన ఏడుగురు రైతులకు హైదరాబాద్‌లోని నేషనల్ మెడికల్ ప్లాంట్‌కు చెందిన ఓ ప్రైవేట్ సంస్ద ఉచితంగా విత్తనాలు ఇచ్చి సాగుకు తగిన సూచనలు, సలహాలు ఇస్తోంది. క్వింటాకు రూ.15వేలు చెల్లిసామని హామీ ఇచ్చి రైతులతో సాగును ప్రారంభింపజేశారు. ఎకరాకు ఏడు నుంచి ఎనిమిది క్వింటాళ్లకు పైగా వేర్లు వస్తాయనుకుంటే ఈ ఏడాది ఎస్సారెస్పీ ద్వారా గోదావరి జలాలు సక్రమంగా అందకపోవడంతో నీటికొరత ఏర్పడింది. దీంతో దిగుబడి తగ్గే అవకాశం ఉందంటున్నారు. ఇదిలా ఉండా కలుపు పెరిగినప్పుడు గొర్రెలు, మేకల గుంపును అశ్వగంధం తోటలో వదిలితే అశ్వగంధం చెట్లు మినహా మిగతా కలుపు మొక్కలను తినేస్తాయి. ఈ కారణంగా కలుపు నివారణ ఖర్చుల సమస్య ఉండదని రైతులు తెలిపారు. నీటి సదుపాయం సక్రమంగా లేకపోవడంతో నాలుగు నుంచి ఐదు క్వింటాళ్ల వరకే వేర్లు దిగుబడి వచ్చే అవకాశం ఉందని రైతులు తెలిపారు. ఎకరాకు 10కిలోల అశ్వగంధం విత్తనాలను ఉచితంగా ఇచ్చిన కంపెనీ ముందుగా భూసార పరీక్షలు నిర్వహించినట్లు రైతులు తెలిపారు. 15 రోజులకు ఒకసారి మొక్కలకు నీరుపెడుతున్నామని, పంట మంచి గానే ఉందని రైతులు తెలిపారు. రాష్ట్రంలో మొదటిసారిగా సాగవుతున్న అశ్వగంధం సాగుపై రైతులకు అధికారులు సహకారం అందజేయాలని స్థానికులు కోరుతున్నారు.
వేసిన పంటే వేసి విసిగిపోయా
ప్రతి ఏడాది పత్తి, వరి పంట సాగు చేస్తూ ధర లేక నీటి సదుపాయం సక్రమంగా లేక విసిగిపోయాం. అశ్వగంధం సాగు ద్వారా ఎన్నోరకాల లాభాలతో పాటు మార్కెటింగ్ సదుపాయం ఉన్నట్లు తెలిసి అధికారుల సహకారంతో సాగు ప్రారంభించాం. ముందుగా విత్తనాలతో పాటు మార్కెటింగ్ ధర హామీ ఇవ్వడంతో సాగుకు ముందుకువచ్చాం. ఏడాది అనుకున్నట్లు దిగుబడి వస్తే ఎక్కువ ఎకరాల్లో సాగు చేస్తాం.
- జాల శ్రీను, రైతు, కోటపహాడ్ గ్రామం