Share News

కారు ఢీకొని మహిళ..

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:56 AM

రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో మృతి చెందింది.

కారు ఢీకొని మహిళ..

మోటకొండూరు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : రోడ్డు దాటుతున్న మహిళను వేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో మృతి చెందింది. ఈ సంఘటన యాదాద్రిభువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కొండాపురంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన గుడ్డేటి నర్సమ్మ(60) రాయగిరి-మోత్కూరు ప్రధాన రోడ్డు వెంట ఉన్న కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లడానికి రోడ్డు దాటుతోంది. రాయగిరి నుంచి మోత్కూరు వైపు వెళ్తున్న కారు ఆమెను ఢీకొట్టింది. దీంతో ఆమె తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కాగా ప్రమాదానికి కారణమై కారు నడుపుతున్న వ్యక్తి సంఘటన జరగగానే భయపడి కారు లాక్‌ చేసుకుని అక్కడి నుంచి పరారయ్యాడని స్థానికులు తెలిపారు.

Updated Date - Apr 10 , 2025 | 12:56 AM