Share News

ధరణి ఆపరేటర్ల వేతనాలేవీ?

ABN , Publish Date - Apr 06 , 2025 | 11:58 PM

ధరణి ఆపరేటర్లు వేతనాల కోసం ఏడాది కాలంగా అవస్థలు పడుతున్నారు. ఇచ్చేదే తక్కువ జీతం అది కూడా 12 నెలలుగా ఇవ్వకపోవడంతో కుటుంబ అవసరాలకు అప్పుపుట్టక ఆర్థికంగా ఇబ్బం దులు పడుతున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి వినవించుకున్నా ఫలితం లేకుండా పోతోందని వాపో తున్నారు. - (ఆంధ్రజ్యోతి-మిర్యాలగూడ)

  ధరణి ఆపరేటర్ల వేతనాలేవీ?

తహసీల్దార్‌ కార్యాలయాల్లో పనిచేస్తున్న ధరణి ఆపరేటర్లకు 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు వేతనాలు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2018లో ఆపరేటర్లుగా విధు ల్లో చేరిన ఏడాది వరకు నెలనెల వేతనాలు ఇచ్చిన ప్రభుత్వం మరుసటి ఏడాది నుంచి రెం డు నెలలు జీతాలు ఇస్తే మరో ఐదారు నెలలు జీతాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది ప్రస్తుతం ఎఫ్‌టీఎ్‌స(ఫీల్డ్‌ టెక్నిక్‌ స్టాఫ్‌) ఉద్యోగులు గతేడాదిగా జీతాలు అందక అవస్థ లు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

టీజీటీఎ్‌సకు అటాచ

గతంలో థర్డ్‌పార్టీ ఏజెన్సీ టెరాసిస్‌ ద్వారా ఆపరేటర్లకు వేత నాలు వచ్చేవి. టెరాసిస్‌ కాంట్రాక్టు పూర్తి కాగానే దానిని రద్దు చేస్తూ ధరణి ఆపరేటర్లను ప్రభుత్వ టెక్నికల్‌ సర్వీసె్‌స కు అటాచ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం వెబ్‌ల్యాండ్‌ నిర్వహణకు 2018 మే 23న రాష్ట్రవ్యాప్తంగా మండలానికి ఒకరిని చొప్పున 584 మంది ఎఫ్టీఎస్‌,వారికి తోడుగా 31 జిల్లాల్లో జిల్లా కోఆర్డినేటర్లతో కలిపి 713 నియమించేందుకు ఇంటిగ్రేటెడ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ మేనేజ్‌మెంట్‌ సిస్ట (ఐఎల్‌అండ్‌ఎ్‌ఫఎస్‌) అనే కంపెనీ గతంలో టెరాసి్‌స కు అవకాశం కల్పించింది. కొంతకాలం తరువాత టెరాసిస్‌ ఉద్యోగుల నిర్వాహణ పారాడిగమ్‌ ఐటీ కంపెనీకి అప్పగించింది. నల్లగొండ జిల్లాలో 36, సూర్యాపేట జిల్లాలో26. యాదాద్రి జిల్లాలో 19 మంది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 81 మంది ధరణి ఆపరేటర్లుగా పని చేస్తున్నారు. టెరాసిస్‌ కాంట్రాక్టు గడువు ముగియడంతో ఉద్యోగుల బా ధ్యతను ప్రభుత్వం చేపట్టింది. దీంతో 63 జీవో ప్రకారం వేతనాలు పెరగడమే కాకుండా నెలనెల జీతాలు అందుతాయన్న ఆశతో ఉన్న ఉద్యోగులకు నిరాశే ఎదురవుతోందని వాపోతున్నారు.

కుటుంబ అవసరాలకు పీఎఫ్‌ డ్రా చేసుకొని..

పనిభారం ఎక్కువైనప్పటికీ తక్కువ జీతానికి ఎలాగో కుటుం బాలను పోషించుకుంటూ వస్తు న్న ఎఫ్‌టీఎ్‌సలు ఆ కొంత జీతం కూడా ఏడాది గా అందకపోవడంతో పీఎఫ్‌ డబ్బులను డ్రా చేసుకుని కుటుంబ అవసరాలకు వినియోగించుకుంటుండగా ఇంటి అద్దె, పిల్లల ఫీజులకు అప్పు లు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో ఎఫ్టీఎ్‌సకు ప్రభుత్వం 2021 జూన వరకు ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ ఎస్‌ కంపెనీ ద్వారా రూ.18 వేలు చెల్లించగా 21 జులై నుంచి టెరాసిస్‌ కంపెనీ(ప్రస్తుతం ఎనఐిసీ) ద్వారా 24 వే లు చెల్లిస్తు ండగా ఒక్కో ఉద్యోగి జీతం నుంచి నెలకు రూ. 5 వేల చొప్పున టెరాసిస్‌ కంపెనీ తీసుకుంటోంది. మిగిలిన 19 వేలలో పారా డిగ మ్‌ ఐటీ కంపెనీ రూ. 3 వేలు కోత విధిస్తోంది. మిగతా రూ.16 వేలలో పీఎఫ్‌, ఈఎ్‌సఐ కటింగ్‌ లు పోనూ నికరంగా ఒక్కో ఎఫ్‌టీ ఎస్‌ ఉద్యోగికి రూ. 11వేల వరకు జీతం అందుతోంది. ధరణి సైట్‌లో నెలకొన్న లోపాలను సవరిస్తూ కాంగ్రెస్‌ ప్రభుత్వం ధరణి స్థానంలో భూమాత వెబ్‌సైట్‌ ను తీసుకవచ్చేందుకు పూర్తి స్థాయి లో సన్నద్ధ్దమైంది. ఈ క్రమంలో ఉద్యోగుల నియామక బాధ్యతలను నిర్వహిస్తున్న ఏజెన్సీని తప్పించి 2025 జనవరి 1 నుంచి ప్రభుత్వం టీజీటీఎ్‌సకు అప్పగించింది. కాగా ఏడాది కాలంగా జీతాలు లేక ఆపరేటర్లు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వాన్ని అడగలేక, ఆర్థ్ధిక పరిస్థితుల్ని తట్టుకోలేక సతమత మవు తున్నారు. ధరణి వెబ్‌సైట్‌ను తీర్చిదిద్ది భూమాతగా మార్పు చేస్తున్నట్లే ఆపరేటర్ల జీవితాలను ఆర్ధిక భారం నుంచి గట్టెక్కించి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ గ్యారెంటీ, నెలవారగా వేతనాలు చెల్లించాలని కోరు తున్నారు.

వేతనాలు పెంచి ప్రతి నెల ఇవ్వాలి

పనిభారం ఎక్కువైనా తక్కువ జీతాలకు పనిచేస్తున్నాం. ప్రభు త్వం ధరణి భూమాతగా మారుస్తున్నట్లే ఆపరేటర్లకు వేతనాలు పెంచి టీజీటీఎస్‌ ద్వారా నెలనెల జీతాలు ఇవ్వాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. జీవో 63 ప్రకారం ఆపరేటర్లకు 31,040 జీతం ఇవ్వాలి. ఆర్ధిక ఇబ్బందులతో సతమవుతూ ఏడేళ్లుగా విధులు నిర్వహిస్తున్న ఎఫ్‌టీఎ్‌సలను ప్రభుత్వం ఆదుకోవాలి.

- అనిల్‌, మాడ్గులపల్లి మండల ఽధరణి ఆపరేటర్‌.

జీతం తక్కువ పని ఎక్కువ..

వెబ్‌ల్యాండ్‌ స్థానంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధరణి సైట్‌ను తీసుకొచ్చింది. మండలాల వారీగా రైతులకు ఈ వెబ్‌సైట్‌ ద్వారా సేవలందించేందుకు ఎఫ్టీఎస్‌ ఉద్యోగులకు నిర్వాహణ బాధ్యతలను అప్పగించింది. మండల రెవెన్యూ కార్యాలయాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బిజిబిజీగా గడపాల్సిందే. ఒక్కోరోజు తహసీల్దార్‌ బయట విజిట్‌లకు వెళ్లినప్పుడు రాత్రి 10 గంటల వరకు విధులు నిర్వహించాల్సి వస్తోంది. సర్వే నంబర్ల వారీగా రై తుల వేలిముద్రల సేకరణ, సైట్‌లో వివరాలు పొందు పర్చడం వంటి పనుల్లో ఎఫ్టీఎ్‌సలు బిజీబిజీగా గడపాల్సి వస్తోంది. ల్యాండ్‌ రిజిస్ర్టేషన విఽధులు తహసీల్దార్లకు బదిలీ అయిన తరువాత మరి ంత బిజీగా మారిందని అంటున్నారు. రోజుకు 12గంటలకు పైగా కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్నప్పటికీ రూ. 11వేల జీతం మాత్రమే అందుతోంది.

Updated Date - Apr 06 , 2025 | 11:58 PM