ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Metro Rail: ఓల్డ్‌సిటీ మెట్రోకు మద్దతు!

ABN, Publish Date - Jan 06 , 2025 | 03:14 AM

ఓల్డ్‌సిటీ వాసులు మెట్రో రైలు కోసం మద్దతు పలుకుతున్నారు. తమ ప్రాంతంలో మెట్రో కలను నెరవేర్చుకోవడంలో భాగంగా ఆస్తులను ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారు.

  • కారిడార్‌ నిర్మాణంలో 1100 ఆస్తులు ప్రభావితం

  • ఆస్తులు ఇచ్చేందుకు నిర్వాసితుల సుముఖత

  • అనుమతి పత్రాలిచ్చిన 169 మంది.. నేడు చెక్కుల పంపిణీ

హైదరాబాద్‌ సిటీ, జనవరి 5(ఆంధ్రజ్యోతి): ఓల్డ్‌సిటీ వాసులు మెట్రో రైలు కోసం మద్దతు పలుకుతున్నారు. తమ ప్రాంతంలో మెట్రో కలను నెరవేర్చుకోవడంలో భాగంగా ఆస్తులను ఇచ్చేందుకు సుముఖత చూపిస్తున్నారు. దీంతో ఇక్కడ కారిడార్‌ నిర్మాణానికి అధికారులు వేగంగా చర్యలు తీసుకుంటున్నారు. కారిడార్‌-6లో ఎంజీబీఎ్‌స-చాంద్రాయణగుట్ట మధ్య చేపడుతున్న 7.5 కిలోమీటర్ల కారిడార్‌ నిర్మాణంలో భాగంగా 1100 ఆస్తులు ప్రభావితమవుతున్నట్లు హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్‌ లిమిటెడ్‌(హెచ్‌ఏఎంల్‌) అధికారులు ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇందులో దాదాపు 90 శాతం మంది ఆస్తులను ఇచ్చేందుకు సిద్ధంగా ఉండగా, కేవలం 10 శాతం మంది ఇంకా వేచి చూసే ధోరణిలో ఉన్నట్లు తెలుస్తోంది. చదరపు గజానికి రూ.81వేలతోపాటు భవన నిర్మాణానికి అదనంగా మరికొంత ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉండడంతో నిర్వాసితులు ఆసక్తి చూపిస్తున్నారు. మొత్తం 1100 మందిలో ఇప్పటివరకు 169మంది అనుమతి పత్రాలు ఇచ్చారు.


ఓల్డ్‌సిటీ నిర్వాసితులకు నేడు చెక్కుల పంపిణీ

ఓల్డ్‌సిటీ మెట్రో నిర్మాణంలో ఆస్తులను కోల్పోతున్న నిర్వాసితులకు సోమవారం హైదరాబాద్‌ కలెక్టరేట్‌లో చెక్కులను పంపిణీ చేస్తున్నట్లు హెచ్‌ఏఎంఎల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ నిర్వాసితులకు చెక్కులను అందజేస్తారని తెలిపారు. మిగతా వారికి రసూల్‌పురాలోని మెట్రో భవన్‌లో అందజేస్తామన్నారు. కాగా, చెక్కులను అందజేసిన నిర్వాసితుల ఆస్తులను త్వరలో కూల్చివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఓ వైపు విడతల వారీగా చెక్కులను పంపిణీ చేస్తూనే కూల్చివేతలు కూడా చేపడతామన్నారు.

Updated Date - Jan 06 , 2025 | 03:14 AM