Hyderabad: పాతబస్తీ మెట్రో పనులు వేగవంతం
ABN, Publish Date - Jan 03 , 2025 | 09:53 AM
పాతబస్తీ(Old City)లో మెట్రో నిర్మాణానికి అవసరమైన క్షేత్రస్థాయి పనులను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్), రెవెన్యూ అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు.
- 7న పరిహారం పంపిణీ
- మరుసటి రోజు నుంచికూల్చివేతలు ప్రారంభం?
- ఇప్పటి వరకూ 189 మంది సమ్మతి లేఖలు
హైదరాబాద్ సిటీ: పాతబస్తీ(Old City)లో మెట్రో నిర్మాణానికి అవసరమైన క్షేత్రస్థాయి పనులను హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో రైల్ లిమిటెడ్ (హెచ్‌ఏఎంఎల్), రెవెన్యూ అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. ప్రధానంగా మెట్రో ఏర్పాటు కోసం ఆస్తులు కోల్పోతున్న బాధితులకు పరిహారం అందించే కార్యక్రమాన్ని చివరి దశకు తీసుకొచ్చారు. సమ్మతి లేఖలు ఇచ్చిన వారికి ఈ నెల 7న హైదరాబాద్ కలెక్టరేట్‌లో పరిహారం చెక్కులు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. రెండో దశ విస్తరణలో భాగంగా ఎంజీబీఎస్(MGBS) నుంచి చాంద్రాయణగుట్ట వరకు 7.5 కిలోమీటర్ల పనులను రాష్ట్ర ప్రభుత్వం మొదటి ప్రాధాన్యతగా పరిగణిస్తోంది. రూ.2,741 కోట్లతో ఈ కారిడార్‌ను పూర్తి చేసేందుకు సిద్ధమైంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: పండగలకు ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు..
దారుల్‌షిఫా, ఆలిజాకోట్ల, హరిబౌలి, మీర్ మోమిన్‌దైరా, లాల్‌దర్వాజా మోడ్, ఆలియాబాద్ జెండా, ఫలక్‌నుమా(Falaknuma) మీదుగా చేపడుతున్న నిర్మాణంలో 1,100 ఆస్తులు కోల్పోతున్నట్లు హెచ్‌ఏఎంల్ అధికారులు గతంలోనే ప్రకటించారు. వీటికి సంబంధించి హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి దశలవారీగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఆస్తులు కోల్పోతున్న వారికి గజానికి రూ.81 వేలు ఇస్తున్నట్లు ఇటీవల హెచ్‌ఏఎంఎల్, రెవెన్యూ అధికారులు ప్రకటించారు.
దీనికి అంగీకరించే వారు రసూల్‌పురాలోని మెట్రో భవన్‌కు వచ్చి డాక్యుమెంటేషన్‌ను పూర్తి చేసుకోవాలని సూచించారు. దీంతో పాత బస్తీలోని ఆయా ప్రాంతాలకు చెందిన బాధితులు పది రోజులుగా మెట్రో భవన్‌కు తరలివెళ్తూ ఆ ప్రక్రియను పూర్తి చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 189 ఆస్తులకు సంబంధించి యజమానులు సమ్మతి లేఖలు ఇచ్చినట్లు ఓ అధికారి తెలిపారు. మరో నాలుగు రోజుల్లో 300 మంది వచ్చే అవకాశం ఉందని చెప్పారు.
హైదరాబాద్ కలెక్టరేట్(Hyderabad Collectorate)లో మంత్రులు, ఎంపీ చేతుల మీదుగా బాధితులకు చెక్కులు పంపిణీ చేసిన మరుసటి రోజు నుంచే పాత బస్తీలో కూల్చివేతలు ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు హెచ్ ఏఎంఎల్ అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తొలి విడతలో 50 మందికి కలెక్టరేట్‌లో చెక్కులు పంపిణీ చేసి, మిగతా వారికి మెట్రోభవన్‌కు పిలిచి అందజేయనున్నారు. చెక్కులు తీసుకున్నవారి ఆస్తులను వరుసగా తొలగించనున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Formula E Race: ఇదేం ఫార్ములా?
ఈవార్తను కూడా చదవండి: 765 చెరువుల ఎఫ్‌టీఎల్ నిర్ధారణ
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ: హరీశ్ రావు
ఈవార్తను కూడా చదవండి: అన్నదాతలకు రేవంత్ సున్నంపెట్టే ప్రయత్నం
Read Latest Telangana News and National News
Updated Date - Jan 03 , 2025 | 09:54 AM