Hyderabad: ఇప్పటి వరకు వసూలైంది రూ.60 కోట్లు మాత్రమే..
ABN, Publish Date - Mar 27 , 2025 | 10:13 AM
హైదరాబాద్ మెట్రో డవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ)లో ఎల్‌ఆర్‌ఎస్ -2020కు సంబంధించి ఇప్పటి వరకు రూ.60కోట్లే ఫీజు వసూలైంది. ఇంకా వసూలు కావాల్సినవి కోట్ల రూపాయలు ఉన్నట్లు తెలుస్తోంది.
- ఫీజుల చెల్లింపునకు ముందుకు రాని ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుదారులు
హైదరాబాద్ సిటీ: హెచ్‌ఎండీఏ(HMDA)లో ఎల్‌ఆర్‌ఎస్ -2020కు సంబంధించి ఇప్పటి వరకు రూ.60కోట్లే ఫీజు వసూలైంది. ఎల్‌ఆర్‌ఎస్ ఫీజు చెల్లించాలని 1.95 లక్షల దరఖాస్తుదారులకు అధికారులు సమాచారం అందించగా, ఇప్పటి వరకు కేవలం 20వేల దరఖాస్తులకే ఫీజు చెల్లించారు. ఫీజు చెల్లించేందుకు ఇంకా నాలుగు రోజులే గడువు ఉంది. ఆలోపు ఏ మేరకు ఫీజు చెల్లింపులు ఉంటాయనే సందిగ్ధత నెలకొన్నది.
అప్పట్లో రూ. వెయ్యి కోట్లు
ఎల్‌ఆర్‌ఎస్ - 2015 తీసుకొచ్చిన సందర్భంలో 1.74 లక్షల దరఖాస్తుల్లో 99వేల దరఖాస్తులను పరిష్కరించారు. వాటి ద్వారా అప్పట్లో హెచ్‌ఎండీఏకు సుమారు రూ.వెయ్యి కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అదే తరహాలో ఎల్‌ఆర్‌ఎస్-2020 ద్వారా హెచ్‌ఎండీఏకు వచ్చిన 3.44లక్షల దరఖాస్తులను పరిష్కారం చేస్తే సుమారు వెయ్యి కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేసుకున్నారు.
అయితే రెండు నెలల క్రితం వరకు హెచ్‌ఎండీఏ(HMDA)లో 3.44లక్షల దరఖాస్తుల్లో దాదాపు 50వేల దరఖాస్తులకు పరిష్కారం చేపట్టగా.. అందులో కొన్ని దరఖాస్తుల నుంచే ఫీజు వచ్చింది. కనీసం రూ.పది కోట్లు కూడా ఆదాయం రాలేదు. ఈ పరిస్థితుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ ఇంజనీరింగ్ పద్దతి చేపట్టి ఎల్‌ఆర్‌ఎస్ ఫీజులు ముందు చెల్లించుకొని.. ఆ తర్వాత ఫీజు చెల్లించిన దరఖాస్తులను పరిష్కారం చేసే ప్రక్రియను చేపట్టారు. అయినా 1.95 లక్షల దరఖాస్తులకు గాను, కేవలం 20వేల దరఖాస్తులకు మాత్రమే ఫీజు చెల్లింపులు జరిగాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
‘పది’ ప్రశ్నపత్రం లీకేజీకి రాజకీయ రంగు
Read Latest Telangana News and National News
Updated Date - Mar 27 , 2025 | 10:13 AM