ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Pigeon Racing: ఉపాధికో పందెం కోడి!

ABN, Publish Date - Jan 12 , 2025 | 05:10 AM

ఎక్కడో తీగ లాగితే డొంక మరెక్కడో కదిలినట్టు... కోడి పందాలు ఏపీలో జరిగినా పోటీకి సిద్ధం చేసే కోళ్లకు నెలవవుతోంది మన హైదరాబాద్‌! మనుపూ పందాల కోసం పుంజులను సిద్ధం చేయడం ఇక్కడ ఉండేది.

  • ఏపీలో పందాల కోసం నగరం నుంచి కోళ్లు

  • విద్యార్థుల నుంచి టెకీల దాకా ఇదే వ్యాపకం

  • గోదావరి జిల్లాల నుంచి వచ్చి కొనుగోలు

  • కనీసం రూ.40వేలు.. గరిష్ఠం రూ.లక్ష వరకు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): ఎక్కడో తీగ లాగితే డొంక మరెక్కడో కదిలినట్టు... కోడి పందాలు ఏపీలో జరిగినా పోటీకి సిద్ధం చేసే కోళ్లకు నెలవవుతోంది మన హైదరాబాద్‌! మనుపూ పందాల కోసం పుంజులను సిద్ధం చేయడం ఇక్కడ ఉండేది. గోదావరి జిల్లాల నుంచి బతుకుదెరువు కోసం వచ్చినవాళ్లు అక్కడక్కడా కోళ్లను పెంచేవారు. ఇప్పుడిది విస్తృతమైంది. అపార్ట్‌మెంట్లలో పని చేసే వాచ్‌మెన్లు, చిరుద్యోగులు విద్యార్థులు, జిమ్‌ ట్రైనర్లు, చివరికి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులూ పందాలకు కోళ్లను రెడీ చేసే పనిలో ఉన్నారు. సంక్రాంతి పండుగ కోసం ఓ ఏడాది ముందే పందాల కోసం కోళ్ల పోషణ మొదలవుతుంది. కొందరు ఫ్లాట్లలో ఒకట్రెండు కోళ్లను పెంచుతుంటే, ఇంకొందరు నగరశివార్లలో ఫామ్‌హౌ్‌సలలో పెద్ద సంఖ్యలో పెంచుతున్నారు. పందాలకు కోళ్లను రెడీ చేయడం అంటే మాటలు కాదు. కోడి ఎప్పుడూ చురుకుగా ఉండాలి. ఇందుకు వాటికి నిత్యం క్రమం తప్పకుండా వాకింగ్‌, స్విమ్మింగ్‌ చేయిస్తారు, జీడిపప్పు, బాదాం, పిస్తా పప్పులు, ఉడకబెట్టిన గుడ్లు, మొలకెత్తిన గింజలు పెడతారు.


ఫలితంగా ఏడాదంతా ఆ కోళ్లకు రాజభోగమే! పోషణకు పెద్ద మొత్తంలో ఖర్చవుతుంది కాబట్టి పందెం కోడి ధర ఎక్కువగానే ఉంటుంది. కోడి ఎత్తు, చురుకుదనాన్ని బట్టి తక్కువకు తక్కువ రూ.40వేల నుంచి రూ.లక్ష దాకా విక్రయిస్తారు. ప్రత్యేకం గా గోదావరి జిల్లాల నుంచి పందెం రాయుళ్లు వచ్చి ఈ కోళ్లను కొంటుంటారు. దీంతో ఈ కోళ్లను పెంచడం చక్కని ఉపాధి మార్గంగా మారింది. ఇప్పటికే చాలా కోళ్లు పందాల కోసం గోదావరి జిల్లాలకు చేరాయి. ఏటా సంక్రాంతికి రెణ్నెల్ల ముందే ఎర్రగడ్డ ఆదివారం మార్కె ట్లో తాను పందెం కోళ్లను అమ్మడం ప్రారంభిస్తానని, సంపత్‌ అనే చేవెళ్లకు చెందిన ఇంజనీరింగ్‌ విద్యార్థి చె ప్పాడు. ఇంట్లోనే చిన్న ఫామ్‌ పెట్టి కోళ్లను పెంచుతున్నానని తెలిపాడు.


ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో టీమ్‌లీడర్‌గా పనిచేస్తున్న క్రిష్‌, తాను 15 ఏళ్లుగా కోడిపుంజులను పెంచుతున్నట్లు చెప్పాడు. మేడ్చల్‌ ప్రాం తంలో తనకో ఫామ్‌హౌస్‌ ఉందని, గోదావరి జిల్లా ల నుంచే ఓ కుటుంబాన్ని తీసుకొచ్చి అక్కడ కోళ్లు పెం చుతున్నట్లు చెప్పాడు. ఈయన దగ్గర వందల సంఖ్యలో పందెం కోళ్లున్నాయి. వాటిని జాతి, పొగరు, వయసు తదితర అంశాల వారీగా విభజించి మరీ ప్రత్యేక ఏర్పాట్ల మధ్య పెంచుతున్నారు. ఇక్కడ కోళ్ల పెంపకం కోసం తొలి 10నెలల పాటు నెలకు కనీసం రూ.40వేలు ఖర్చు చేస్తే.. నవంబరు-జనవరి మధ్య నెలకు రూ.80వేలు ఖర్చు పెడుతున్నారు. కల్యాణ్‌నగర్‌లో ఓ అపార్ట్‌మెంట్‌లో పనిచేస్తున్న వాచ్‌మన్‌ వెంకన్న మాట్లాడుతూ కోళ్లకు మాంసం, గుడ్లు లాంటివి అందిస్తానని, నానబెట్టిన చోళ్లు, మొలకలు పెడతానని చెప్పాడు. తన రెండు కోళ్లతో భీమవరం వెళుతున్నానని, అక్కడే విక్రయిస్తానని చెప్పాడు.


ఇక్కడా కోడి పందాలు

తెలంగాణ లోనూ ఇటీవలి కాలంలో కొంతమంది పందాలు వేస్తున్నారని చెప్పాడు పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ చిరుద్యోగి. నగర శివార్లలోనే వారాంతాల్లో కొన్నిసార్లు పందాలు జరుగుతాయని, సంక్రాంతి సమయంలో మాత్రం తప్పనిసరిగా ఉంటాయని, అపార్ట్‌మెంట్‌ టెర్ర్‌సలపై పోటీలు ఎప్పుడో కానీ ఉండవు కానీ, శివార్లలో మాత్రం జరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం తన దగ్గర ఐదు పుంజులున్నాయని అతను చెప్పాడు.

Updated Date - Jan 12 , 2025 | 05:10 AM