ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sangareddy: ఆల్ర్ఫాజోలం తయారీ..

ABN, Publish Date - Jan 12 , 2025 | 04:31 AM

రసాయన కంపెనీ మాటున కల్లు కల్తీకి వినియోగించే ఆల్ర్ఫాజోలం డ్రగ్స్‌ను తయారు చేస్తున్న ముఠా గుట్టును సంగారెడ్డి సీసీఎస్‌, గుమ్మడిదల పోలీసులు రట్టు చేశారు.

  • 60 కోట్ల ఆస్తుల సీజ్‌..ఐదుగురు నిందితుల అరెస్టు

సంగారెడ్డి క్రైం, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): రసాయన కంపెనీ మాటున కల్లు కల్తీకి వినియోగించే ఆల్ర్ఫాజోలం డ్రగ్స్‌ను తయారు చేస్తున్న ముఠా గుట్టును సంగారెడ్డి సీసీఎస్‌, గుమ్మడిదల పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠా హైదరాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. డ్రగ్స్‌ను తయారు చేస్తున్న కంపెనీ, ఇతర ఆస్తులు, 740 గ్రాముల ఆల్ర్ఫాజోలం, మూడు కార్లు, ఆరు సెల్‌ఫోన్ల స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.60 కోట్లుగా ఉంటుంది. జిల్లా ఎస్పీ రూపేశ్‌ వివరాలను వెల్లడించారు. మెదక్‌ పట్టణంలోని పిట్లంబే్‌సకు చెందిన గిర్మగౌని సుధీర్‌గౌడ్‌ అనే రియల్టర్‌ పటాన్‌చెరు మండలం ముత్తంగిలోని తన్మయీహోమ్స్‌లో ఉంటూ.. తన బావమరిది ప్రభుగౌడ్‌తో కలిసి 2014లో కల్లు దుకాణాలకు ఆల్ర్ఫాజోలం విక్రయాలను ప్రారంభించాడు.


గుమ్మడిదలకు చెందిన సాయిగౌడ్‌, ముత్తంగికి చెందిన బిశ్వేశ్వర్‌సింగ్‌, రాజేశ్వర్‌శర్మ జోషితో కలిసి 2023లో రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోని అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం బాచారం గ్రామ శివారులోని సర్వే నంబరు 39లో సాయిప్రియ కెమికల్స్‌ కంపెనీని కొనుగోలు చేశాడు. ఆ కంపెనీలో వీరంతా సుధీర్‌ డ్రైవర్‌ శశికుమార్‌ సాయంతో ముడిపదార్థాలు తెప్పిస్తూ.. అక్రమంగా ఆల్ర్ఫాజోలం తయారు చేసేవారు. క్వింటా ఆల్ర్ఫాజోలాన్ని వీరు రూ.4 లక్షలకు విక్రయించేవారు. గత నెల 31న కలాలి అశోక్‌గౌడ్‌, లింగన్నగారి నారాయణమూర్తిగౌడ్‌, డి.సాయిలు అలియాస్‌ రాజు ఆల్ర్ఫాజోలం తరలిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. వారి విచారణలో ఈ ముఠా వివరాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో.. సీసీఎస్‌, గుమ్మడిదల పోలీసులు మంబాపూర్‌ వద్ద సుధీర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన భార్య శ్రీవాణి, బిశ్వేశ్వర్‌, రాజేశ్వరశర్మ, శశికుమార్‌ను అరెస్టు చేశారు. వీరి వద్ద రూ.60 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేశామని ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరో తొమ్మిదిమంది పరారీలో ఉన్నారరని చెప్పారు.

Updated Date - Jan 12 , 2025 | 04:31 AM