Narendra Modi: నవంబరు 15న రాష్ట్రానికి ప్రధాని మోదీ
ABN , Publish Date - Apr 02 , 2025 | 03:26 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబరు 15న తెలంగాణ రాకవ్వాలని, అబిడ్స్‌లో నిర్మితమవుతున్న రాంజీ గోండ్ గిరిజన మ్యూజియాన్ని ఆ రోజు ప్రారంభించబోతున్నారని విశ్వసనీయంగా సమాచారం. ఈ మ్యూజియం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో 35 కోట్ల వ్యయంతో నిర్మాణం జరుగుతోంది.

హైదరాబాద్, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబరు 15న తెలంగాణ వచ్చే అవకాశముంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో నిర్మితమవుతున్న ‘రాంజీ గోండ్ గిరిజన మ్యూజియం’ను ప్రధాని ఆరోజున ప్రారంభిస్తారని విశ్వసయనీయంగా తెలిసింది. గిరిజన నాయకుడు, స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా జయంతిని పురస్కరించుకుని నవంబరు 15న భారతదేశం.. జన్ జాతీయ గౌరవ్ దివస్ జరుపుకుంటుంది. అదే రోజున హైదరాబాద్‌లో రాంజీ గోండ్ మ్యూజియంను ప్రధాని చేతులమీదుగా ప్రారంభింపజేయాలని కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ.. రాష్ట్ర గిరిజన శాఖకు ఇటీవల సూచించిందని సమాచారం. ఈ మేరకు నవంబరు 15 లోగా మ్యూజియం నిర్మాణం, ఇతర పనులను పూర్తి చేయడంపై రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి బుధ, గురువారాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. కాగా, దేశ స్వాతంత్య్ర పోరాటంలో ప్రాణాలర్పించిన గిరిజనుల త్యాగాలకు గుర్తుగా మ్యూజియంలు ఏర్పాటు చేయాలని 2016 ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రకటించారు. తొలివిడతలో దేశ వ్యాప్తంగా 10 గిరిజన మ్యూజియంలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే, తొలి విడతలో మ్యూజియం కోసం తెలంగాణ చేసిన ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్రం.. 2018-19లో చేసిన ప్రతిపాదనకు సమ్మతించింది. హైదరాబాద్, అబిడ్స్‌లోని 30 గుంటల ప్రభుత్వ భూమిలో రూ.35 కోట్ల వ్యయంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో సెల్లార్, గ్రౌండ్ ఫ్లస్ మూడు అంతస్తులతో భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
నెల్లూరు వైసీపీలో టెన్షన్.. టెన్షన్..
ఎగ్జామ్ లేకుండా IRCTCలో ఉద్యోగాలు..
For More AP News and Telugu News