ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Ramadan: రేపే రంజాన్‌

ABN, Publish Date - Mar 30 , 2025 | 01:47 AM

భారతదేశంలో రంజాన్‌ పండుగ (ఈదుల్‌ ఫితర్‌) సోమవారం జరగనుంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో సౌదీ అరేబియాతో పాటు పలు పశ్చిమాసియా దేశాల్లో ఆదివారం పండుగను జరుపుకుంటున్నారు.

  • నేడు పశ్చిమాసియా దేశాల్లో పండుగ

హైదరాబాద్‌, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): భారతదేశంలో రంజాన్‌ పండుగ (ఈదుల్‌ ఫితర్‌) సోమవారం జరగనుంది. శనివారం సాయంత్రం నెలవంక కనిపించడంతో సౌదీ అరేబియాతో పాటు పలు పశ్చిమాసియా దేశాల్లో ఆదివారం పండుగను జరుపుకుంటున్నారు. దాంతో భారతదేశంలో సోమవారం పండుగను చేసుకోనున్నారు. ఈ నెల 2వ తేదీన రంజాన్‌ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యాయి. దాంతో ఆదివారం రోజున చివరి ఉపవాసదీక్ష ఉండనుంది. ఇక రంజాన్‌ ఉపవాస దీక్షల సందర్భంగా హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా హలీం విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ఈ మాసంలో రూ.800 కోట్ల హలీమ్‌ విక్రయాలు జరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి.


హైదరాబాద్‌లో ఒక్క పిస్తాహౌ్‌సలోనే ప్రతిరోజు 2 వేల కిలోల హలీమ్‌ను విక్రయిస్తుండగా, మదీనాలోని షాదాబ్‌, మాసాబ్‌ట్యాంక్‌లోని 555, మెహదీపట్నం, బంజారాహిల్స్‌లోని సర్వి, పాతబస్తీ, టోలిచౌకి, లక్డీకాపూల్‌, గచ్చిబౌలీ ప్రాంతాల్లోని షాగౌస్‌, మెహ్‌ఫిల్‌ వంటి రెస్టారెంట్లు సగటున రోజుకి 1000 నుంచి 1500 కిలోల దాకా హాలీమ్‌ అమ్ముతున్నట్లు సమాచారం. హైదరాబాద్‌లో ఏప్రిల్‌ 6వ తేదీ దాకా హాలీం విక్రయాలు జరగనున్నాయి. రంజాన్‌ మాసం ముగిసిన తర్వాత షవ్వాల్‌ మాసం ప్రారంభం కానుంది. ఆ మాసం ప్రారంభంలో ఆరు రోజుల పాటు చాలా మంది ఉపవాస దీక్షలు చేస్తారు. దాంతో వారి కోసం ఆరురోజుల పాటు ప్రత్యేకంగా హాలీం తయారుకానుంది.


ఈ వార్తలు కూడా చదవండి

Hyderabad Metro : అదిరిపోయే శుభవార్త చెప్పిన HYD మెట్రో.. రైళ్ల ప్రయాణ వేళలు పొడిగింపు..

GPO Posts: నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్

Sunny Yadav Betting App Case: బెట్టింగ్ యాప్స్ కేసు.. ఒక్కొక్కరికీ చుక్కలు చూపిస్తున్న పోలీసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Mar 30 , 2025 | 01:47 AM