Hyderabad: కేక్‌ల ట్రేల్లో ఎలుకల మలం..
ABN, Publish Date - Jan 05 , 2025 | 08:47 AM
మీకు కేక్ అంటే ఇష్టమేనా.. లొట్టలేసుకుంటూ తింటారా... ఈ విషయం తెలిస్తే అసలు కేక్ జోలికి వెళ్లరేమో.. ట్రేలలో నిల్వ చేసిన కేక్‌ల చుట్టూ ఎలుకలు విసర్జించిన మలం ఉందని తెలిస్తే వామ్మో అనక తప్పదు.
- గడువు ముగిసిన ఆహార ఉత్పత్తులు
- సికింద్రాబాద్, అల్వాల్ బేకరీల్లో అపరిశుభ్ర వాతావరణం
- ఫుడ్‌సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడిన వైనం
హైదరాబాద్: మీకు కేక్ అంటే ఇష్టమేనా.. లొట్టలేసుకుంటూ తింటారా... ఈ విషయం తెలిస్తే అసలు కేక్ జోలికి వెళ్లరేమో.. ట్రేలలో నిల్వ చేసిన కేక్‌ల చుట్టూ ఎలుకలు విసర్జించిన మలం ఉందని తెలిస్తే వామ్మో అనక తప్పదు. అల్వాల్, సికింద్రాబాద్‌లోని వివిధ కేక్ షాప్‌లను తనిఖీ చేసిన ఫుడ్‌సేఫ్టీ అధికారుల బృందానికి ఈ విస్తుగొలిపే అంశాలు కనిపించడంతో అవాక్కయ్యారు. బేకరీ సిబ్బందిని హెచ్చరిస్తూ నోటీసులు జారీ చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
శనివారం ఫుడ్‌సేఫ్టీ అధికారులు(Food safety officials) తెలిపిన వివరాల ప్రకారం.. అల్వాల్(Alwal)లోని ఓ కేక్ షాప్‌లో అపరిశుభ్రమైన ప్రాంతాల్లో కేక్‌లను నిలువచేయడంతో పాటు ప్యాకింగ్ మెటీరియల్, ఇతర ఉత్పత్తులను నేలపై, మెట్ల మీద, ప్లాస్టిక్ డ్రమ్ములలో నిలువ చేసినట్లు గుర్తించారు. షాప్‌లోని అనేక ప్రాంతాల్లో ఎలుకల మలం కనిపించడంతో పాటు కేక్‌లు నిల్వచేసే ట్రేలో కూడా ఉన్నట్లు గుర్తించారు. దుకాణమంతటా బొద్దింకలు తిరుగుతూ కనిపించాయి. పైనాపిల్, వెనిలా ప్లేవర్స్ వంటి అనేక గడువు ముగిసిన వస్తువులు తనిఖీల్లో బయటపడ్డాయి.
దుకాణానికి సంబంధించిన ఏడు రిఫ్రిజిరేటెడ్ వాహనాలకు లైసెన్స్‌లు లేనట్లుగా గుర్తించారు. సికింద్రాబాద్(Secunderabad) కార్ఖానా వద్ద గల బేకరీలో తనిఖీలు నిర్వహించిన ఫుడ్‌సేఫ్టీ అధికారులకు ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్ అనుమతులు లేకుండా ఫ్లంకేక్‌ల తయారీలో ఉపయోగించే అల్కాహాల్(రమ్) ఉపయోగిస్తున్నారని వెల్లడయింది. కేక్‌ల లేబుళ్లపై రమ్‌ను ఉపయోగిస్తున్నట్లు బహిర్గతం చేయలేదని అధికారులు పేర్కొన్నారు. కేక్‌ల కోసం ఉపయోగించే డ్రైఫ్రూట్స్, జామ్ పల్ప్‌ను ప్లాస్టిక్ డ్రమ్ముల్లో నిలువ చేశారని అధికారులు పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే
ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం
ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి
ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు
Read Latest Telangana News and National News
Updated Date - Jan 05 , 2025 | 08:48 AM