ధాన్యం కొనుగోళ్లకు సమాయత్తం
ABN , Publish Date - Apr 12 , 2025 | 11:53 PM
యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో వరి కోతలు ప్రారం భం కాకముందే సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చే స్తున్నారు.

-మూడు లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా
-321 సెంటర్ల ప్రారంభానికి సన్నాహాలు
-కేంద్రాల వద్ద రైతులకు మౌలిక సదుపాయాలు
-యాసంగిలోనూ సన్నాలకు రూ. 500 బోనస్
-మద్దతు ధరలపైనే రైతుల పెదవి విరుపు
మంచిర్యాల, ఏప్రిల్ 12 (ఆంధ్రజ్యోతి): యాసంగి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధం అవుతోంది. జిల్లాలో ఇంకా పూర్తిస్థాయిలో వరి కోతలు ప్రారం భం కాకముందే సెంటర్ల ఏర్పాటుకు సన్నాహాలు చే స్తున్నారు. గతంలో కొనుగోలు కేంద్రాల ఏర్పాటు ఆలస్యం కావడంతో వర్షాలు పడి రైతులకు తీరని నష్టం వాటిల్లింది. దాన్ని ధృష్టిలో ఉంచుకొని అఽధికా రులు ముందస్తుగా చర్యలు చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
పెరిగిన వరి సాగు...
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సారి రబీ సీజన్ లో వరి సాగు జిల్లాలో ఘననీయంగా పెరిగింది. జి ల్లాలో లక్షా 21వేల 702 ఎకరాల్లో వరి పంట సా గైంది. ఇందులో దొడ్డు రకం లక్షా 14 వేల 774 ఎక రాలు కాగా, సన్నరకం 6928 ఎకరాల్లో సాగైంది. గత సీజన్‌లో లక్షా 75వేల మెట్రిక్ టన్నులు అంచనా వే యగా, ఈ సీజన్‌లో ఏకంగా 3 లక్షల 40వేల 301 మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందని అంచనా వే స్తున్నారు. ఇందులో దొడ్డు రకం 3 లక్షల 23వేల 639 మెట్రిక్ టన్నులు కాగా, సన్నరకం ధాన్యం 16 వేల 662 మెట్రిక్ టన్నులు వస్తుందని భావిస్తున్నా రు. కొంతమంది మిల్లరు నేరుగా ధాన్యం సేకరించే అవకాశం ఉండటంతో కొనుగోళ్ల లక్ష్యం కొంతమేర తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు.
పనిచేసిన బోనస్ మంత్రం....
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువా త సన్నరకం వరి ధాన్యం సాగును ప్రోత్సహించేం దుకు రైతులకు అధనంగా క్వింటాలుకు రూ. 500 బోనస్ ప్రకటించింది. గత సీజన్ నుంచి ప్రారంభ మైన బోనస్ చెల్లింపులు యాసంగి సీజన్‌లోనూ కొన సాగించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ధాన్యం క్వింటా ధర సగటున రూ. 2800 వరకు గి ట్టుబాటు అవుతుండటంతో రైతులు సన్నరకాల సాగువైపు మొగ్గు చూపారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా సన్నాలకు బోనస్ అందడంతో యాసంగిలో రైతులు సన్నాల సాగువైపే మొగ్గు చూపారు.
321 కేంద్రాల ఏర్పాటుకు...
యాసంగి సీజన్‌లో వరి ధాన్యం కొనుగోలుకు సం బంధించి జిల్లా వ్యాప్తంగా డీఆర్‌డీఏ, పీఏసీఎస్, మె ప్మా ఆధ్వర్యంలో 361 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నా రు. గత సీజన్‌లో డీఆర్‌డీఏ (ఐకేపీ) ఆధ్వర్యంలో మొత్తం 320 కేంద్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణ యించినా ధాన్యం దిగుబడి మేరకు 315 సెంటర్లు ఏ ర్పాటు చేసి, ధాన్యం కొనుగోలు చేశారు. ఈ సంవ త్సరం ఆయా ఏజెన్సీల ఆధ్వర్యంలో 361 కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించారు. డీఆర్‌డీఏ ఆధ్వర్యం లో 194, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 121, మెప్మా ఆధ్వ ర్యంలో 06 కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆ యా కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో ధాన్యం కొనుగో ళ్లు చేయనున్నారు. ఈ మేరకు సెంటర్ నిర్వాహకు లకు అవసరమైన శిక్షణ పూర్తి చేశారు. లక్ష్యం మేర కు ధాన్యం కొనుగోలు కోసం మొత్తం 57 లక్షల గన్నీ సంచులు అవసరం కాగా 20వేల వరకు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. మిగతా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచేందుకు అధికారులు ప్రయత్ని స్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసేందుకు సన్నా హాలు చేస్తున్నారు.
ఇతర ప్రాంతాల నుంచి తరలిపునకు చెక్...
జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రా లకు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి దాన్యం తరలిం పు జరుగకుండా పకడ్బందీ చర్యలు చేపట్టనున్నారు. కేవలం జిల్లా రైతులు పండించిన దాన్యాన్నే కొనుగో లు కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందులో భాగంగా రెవెన్యూ, పోలీసు, వ్యవసాయ శాఖల సిబ్బంది సమన్వయంతో జిల్లాలోకి వచ్చే అం తరాష్ట్ర సరిహద్దుల వద్ద వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయనున్నారు. చెక్ పోస్టుల వద్ద 24 గంటల పర్య వేక్షణ చేపట్టాలనే ఆదేశాలు జారీ అయ్యాయి.
మద్దతు ధరలపై రైతుల పెదవి విరుపు....
కాగా కేంధ్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా యా సంగిలో వరి ధాన్యం మద్దతు ధరలపై రైతులు పెద వి విరుస్తున్నారు. కేంధ్రం ప్రకటించిన మేరకు వరి పంటకు మద్దతు ధర క్వింటాకు గ్రేడ్-ఏ రకం రూ. 2320 ఉండగా, కామన్ వెరైటీ ధర రూ. 2300 ఉం ది. గత ఏడాదితో పోలిస్తే గ్రేడ్ ఏ, కామన్ వెరైటీకి రూ. 117 చొప్పున ధరలు పెరిగాయి. గత సంవత్స రం గ్రేడ్-ఏ రకం రూ. 2203 ఉండగా, కామన్ వె రైటీ రూ. 2183గా ప్రకటించారు. అయితే వరిసాగు చేసేందుకు ఎకరాకు సుమారు రూ. 25వేల వరకు ఖర్చు వస్తుందని, సాగు ఖర్చులకు అనుగుణంగా మరికొంత మద్దతు ధర పెంచాల్సిందనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.
మద్దతు ధర నిరాశపరిచింది....
లగిశెట్టి రాజమౌళి, గుడిపేట
యాసంగి సీజన్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు పెరిగిన సాగురేట్లకు సరిపో వు. యాసంగిలో మూడెకరాల్లో వరిసాగు చేశాను. దాదాపు రూ. 75 వేల వరకు సాగు ఖర్చులే అయ్యా యి. మొత్తం 60 క్వింటాళ్ల మేర దిగుబడి వచ్చినా బోనస్ కలిపి రూ. లక్షా యాబైవేల వరకు గిట్టుబాట వుతుంది. ఇందులో తాలు, తప్ప, ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే నష్టంపోనూ పెద్దగా చేతిక వచ్చేది ఏమీ లేదు. దొడ్డు రకానికి కూడా రూ. 2800 మద్దతు ధర కల్పిస్తే బాగుండేది.
అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం...
మోతీలాల్, జిల్లా అదనపు కలెక్టర్
రబీ సీజన్‌కు సంబంధించి దాన్యం కొనుగోలు కేం ద్రాలు ఏర్పాటు చేసేందుకు ఇదివరకే సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశాం. త్వరలోనే కొ నుగోలు కేంద్రాలు ప్రారంభించనున్నాం. కేంద్రాల వ ద్ద మౌలిక వసతులు కల్పించాలని ఆదేశించాము. రైతులు కల్లాల్లోనే దాన్యాన్ని ఎండబెట్టుకొని, చెత్తచె దారం లేకుండా చేసి, కేంద్రానికి తీసుకు రావలసి ఉంటుంది.