ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: నేలమ్మను సింగారించెను ముగ్గమ్మ!

ABN, Publish Date - Jan 11 , 2025 | 04:52 AM

చుక్కల వరుస.. నేలంతా పరుచుకొని చక్కని ముగ్గయింది! చూపు.. మనసూ తనవైపు లాక్కొని కదలనీయనంటూ కాళ్లకూ బంధాలేసింది!

  • కన్నుల పండుగగా ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ రాష్ట్రస్థాయి ముగ్గుల పోటీ ఫైనల్స్‌

  • హైదరాబాద్‌ జిల్లాకు చెందిన మాధురి నేమకు ప్రథమ బహుమతి

  • ఆదిలాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల మహిళలకు ద్వితీయ స్థానం

  • విజేతలకు బహుమతులు అందజేసిన నటీనటులు వైష్ణవీ చైతన్య, వడ్లమాని శ్రీనివాస్‌

హైదరాబాద్‌ సిటీ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): చుక్కల వరుస.. నేలంతా పరుచుకొని చక్కని ముగ్గయింది! చూపు.. మనసూ తనవైపు లాక్కొని కదలనీయనంటూ కాళ్లకూ బంధాలేసింది! మేమూ తీరొక్క రంగులనద్దుకొని నేలను సింగారించాం అంటూ ఇంకొన్ని ముగ్గులు సైగ చేశాయి! గొబ్బెమ్మలు, చెరుకు ముక్కలను అద్దుకొని సంక్రాంతి శోభను ముందే తెచ్చాయి! ఇదంతా సనత్‌నగర్‌ జీహెచ్‌ఎంసీ గ్రౌండ్‌లో నిర్వహించిన ఆంధ్రజ్యోతి ముత్యాల ముగ్గుల పోటీల తాలూకు రమణీయతే! ‘ఆంధ్రజ్యోతి-ఏబీఎన్‌’ నిర్వహిస్తున్న సంతూర్‌ ముత్యాల ముగ్గుల పోటీలు.. గార్డెనింగ్‌ పార్ట్ట్‌నర్‌ క్రాఫ్ట్‌ వారి పర్‌ఫెక్ట్‌.. ఫ్యాషన్‌ పార్టనర్‌ డిగ్‌సెల్‌ వారి సెల్సియా (ట్రెండీ మహిళల ఇన్నర్‌వేర్‌) తెలంగాణ రాష్ట్రస్థాయి ఫైనల్స్‌ శుక్రవారం జరిగాయి. ముఖ్య అతిథులుగా సినీనటి వైష్ణవీ చైతన్య, సినీనటుడు వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఫైనల్స్‌లో రాష్ట్రంలోని ఉమ్మడి జిల్లాల నుంచి ఒకరు చొప్పున 10 మంది మహిళలు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రథమ విజేతగా హైదరాబాద్‌కు చెందిన మాధురి నేమ, ద్వితీయ విజేతగా ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన ఎస్‌.హేమలత, కరీంనగర్‌ జిల్లాకు చెందిన కె.లహరి, ఖమ్మం జిల్లాకు చెందిన ఆర్‌. లక్ష్మీ స్రవంతి నిలిచారు.


ప్రథమ విజేతకు రూ.30 వేల చెక్కు.. ద్వితీయ విజేతలకు రూ.10వేల చొప్పున చెక్కులు అందజేశారు. మిగిలిన ఆరుగురికి రూ.3 వేల చొప్పున చెక్కులు అందజేశారు. విజేతలకు బహుమతులను వైష్ణవీ చైతన్య, వడ్లమాని సత్యసాయి శ్రీనివాస్‌ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహిళామణులు పరిచిన ముత్యాల ముగ్గుల్లో సంక్రాంతి సందడి, సంస్కృతి, సంప్రదాయాలు కనిపించాయని వైష్ణవి అన్నారు. నిజమైన సంక్రాం తి అంటే తెలియచేప్పే ప్రయత్నం ‘ఆంధ్రజ్యోతి- ఏబీఎన్‌’ చేస్తోందని వడ్లమాని శ్రీనివాస్‌ అన్నారు. ముగ్గులు వేయడమే మరిచిపోతున్న ఈ రోజుల్లో తెలుగు సంస్కృతి ప్రతిబింబించేలా ముగ్గుల పోటీలు నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. ముగ్గుల పోటీకి న్యాయ నిర్ణేతలుగా బేగంపేట ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్‌ పి.రజని, యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ పీజీ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డా.పి.శ్రీలక్ష్మి వ్యవహరించారు. కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి అసిస్టెంట్‌ ఎడిటర్‌ వక్కలంక రమణ, ఆంధ్రజ్యోతి న్యూస్‌ సెట్‌వర్క్‌ ఇన్‌చార్జి, అసిస్టెంట్‌ ఎడిటర్‌ కృష్ణ ప్రసాద్‌, ఆంధ్రజ్యోతి అడ్వర్టైజ్‌మెంట్‌ డీజీఎం ఆర్‌.ఆర్‌ నాయుడు, సంతూర్‌ ఏపీ, తెలంగాణ రీజనల్‌ సేల్స్‌ మేనేజర్‌ నాగరాజు, సంతూర్‌ హైదరాబాద్‌ ఏరియా మేనేజర్‌ సంజీవ్‌ మోదీ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 11 , 2025 | 04:52 AM