Celebrations: కాయ్.. రాజా కాయ్!
ABN, Publish Date - Jan 13 , 2025 | 04:29 AM
తెలుగు లోగిళ్లు సంక్రాంతి సొబగును సంతరించుకున్నాయి. సోమవారం భోగితో ప్రారంభమయ్యే మూడు రోజుల అతి పెద్ద పండుగ అందరినీ మురిపించనుంది.
ఏపీలో కోడి పందేలకు బరులు సిద్ధం
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్): తెలుగు లోగిళ్లు సంక్రాంతి సొబగును సంతరించుకున్నాయి. సోమవారం భోగితో ప్రారంభమయ్యే మూడు రోజుల అతి పెద్ద పండుగ అందరినీ మురిపించనుంది. ఆనంద పారవశ్యంలో ముంచెత్తనుంది. తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెట్టపీట వేస్తూ పల్లెల్లో సంక్రాంతి సంబరాలు మిన్నంటనున్నాయి. పిల్లా పాపల నుంచి యువత వరకు ఈ సంబరాల్లో మునిగితేలనున్నారు. ఇదేసమయం లో సంక్రాంతి సంబరాల్లో భాగ మైపోయిన కోడి పందేలు కూడా భారీ ఎత్తున జరగనున్నాయి. వీటితోపాటు గుండాట, లోనబయట, పేకాటలు కూడా పం దెంరాయుళ్లను ఖుషీ చేయనున్నాయి. మందు-విందు-చిందుల వంటి ప్రత్యేక ఏర్పాట్లతో కోస్తా సహా పలు జిల్లాల్లో కోడి పందేల బరులు ఈ దఫా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. చిత్రం ఏంటంటే.. ఈ ‘సంస్కృతి’లో తరతమ భేదాలు కానీ, రాజకీయ విభేదాలు కానీ కనిపించకుండా అందరూ చేతులు కలపడమే!!
ఉమ్మడి కృష్ణాలో..
ఏపీలోని ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఈసారి భారీగా కోడిపందేలు జరగనున్నాయి. కృష్ణా జిల్లాలోని అంపాపురం బరిని రూ.3 కోట్లకు ఓ పార్టీ నాయకులు కొనుగోలు చేశారు. ఈ మొత్తాన్ని రాబట్టుకునేందుకు ఇక్కడ కోడిపందేలతో పాటు పేకాట, గుండాట, కోత ము క్కాట, లోనబయట నిర్వహించడానికి రంగం సిద్ధం చేశారు. మద్యం విక్రయాలకు ప్రత్యేకంగా ఒక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్న ట్టు సమాచారం. ఎన్టీఆర్ జిల్లాలోని అంబాపురం, జక్కంపూడిలోని పాములకాల్వ ప్రాం తాల్లో బరులను ఏర్పాటు చేయడాని కి ఇద్దరు ప్రజాప్రతినిధుల అనుచరులు సిద్ధమయ్యారు. తెలంగాణకు సరిహద్దు గ్రామాలు గా ఉన్న గరికిపాడు, బూదవాడ, తొర్రగుంటపాలెం, తిరుమలగిరి, జగ్గయ్యపేటలో బరు లు సిద్ధం చేశారు. పెనుగంచిప్రోలు, కంచికచర్లలో హైటెక్ జూదం నిర్వహించడానికి ఏర్పా ట్లు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. విజయవాడ నడిబొడ్డున ఉండే రామవరప్పాడులో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నివాసం ఉండే ఖరీదైన గేటెడ్ కమ్యూనిటీ చెంతనే ఓ ప్రజాప్రతినిధి అనుచరులు కోడిపందేల బరులు ఏర్పా టు చేశారు. ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాలకు పరిమితమైన బరులు ఈసారి విజయవాడ నగరంలోకి కూడా అడుగుపెట్టడం గమనార్హం.
Updated Date - Jan 13 , 2025 | 04:29 AM