SCR: భాగ్యనగర్ బంద్
ABN, Publish Date - Feb 09 , 2025 | 09:47 PM
bhagyanagar express: దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను రద్దు చేసింది. సికింద్రాబాద్, కాగజ్ నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్ రైల్‌ను రద్దు చేసింది.

హైదరాబాద్, ఫిబ్రవరి 09: సికింద్రాబాద్ - కాగజ్ నగర్ మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. రేపటి నుంచి అంటే సోమవారం ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 21వ తేదీ వరకు ఈ ఎక్స్‌ప్రెస్ రైలును రద్దు చేస్తున్నట్లు ఆ ప్రకటనలో వివరించింది. అంటే దాదాపు 11 రోజుల పాటు ఈ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు నిలిచిపోనున్నాయి. మూడో ట్రాక్ నిర్మాణ పనుల చేపట్టనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
అయితే ఈ భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలను ఉత్తర తెలంగాణ వాసులు వినియోగించుకొంటారన్న సంగతి అందరికి తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి కాజీపేట వయా.. ఉప్పల్ జమ్మికుంట, పాత్కపల్లి, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్ నగర్ వరకు ప్రయాణికులు, ఉద్యోగులు, విద్యార్థులు.. హైదరాబాద్ వచ్చేందుకు ఈ ట్రైయిన్ అందుబాటులో ఉంటుందన్న విషయం విధితమే.
మరోవైపు ఖమ్మం రైల్వే స్టేషన్ పరిధిలో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్నాయి. దీంతో 30 రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఆయా రైళ్లను వేర్వేరు రోజుల్లో క్యాన్సిల్ చేయనున్నట్లు ప్రకటించింది. కాజీపేట- డోర్నకల్, డోర్నకల్- విజయవాడ, భద్రాచలం రోడ్డు- విజయవాడ ప్యాసింజర్ రైళ్లను 11 రోజుల పాటు క్యాన్సిల్ చేస్తున్నట్లు తెలిపింది.
అంటే, ఈ రైళ్లు ఈ నెల 10 నుంచి 20వ తేదీ వరకు ఈ మార్గంలోని నడిచే రైళ్లను రద్దు చేస్తున్నట్లు వివరించింది. అటు గోల్కొండ, భాగ్యనగర్, శాతవాహన సహా పలు ఎక్స్ ప్రెస్ రైళ్లు వారం నుంచి 11 రోజుల పాటు ప్రయాణికులకు అందుబాటులో ఉండవని ప్రకటించింది. మరో 9 రైళ్లను దారి మళ్లించినట్లు తెలిపింది. నాలుగు రైళ్లు సుమారు 60 నుంచి 90 నిమిషాల ఆలస్యంగా బయల్దేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.
Also Read :స్నేహం చేస్తారా? కటీఫ్ చెబుతారా?.. కేజ్రీ ప్లాన్ అదేనా?
రద్దు అయిన రైళ్లు.. వాటి వివరాలు..
సికింద్రాబాద్- గుంటూరు (17201/17202) గోల్కొండ ఎక్స్ ప్రెస్: ఫిబ్రవరి 11 నుంచి 21 వరకు క్యాన్సిల్.
సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ (17233/17234) భాగ్యనగర్ ఎక్స్ ప్రెస్: ఫిబ్రవరి 10 నుంచి 21 వరకు రద్దు.
గుంటూరు-సికింద్రాబాద్ (12705/12706) ఇంటర్‌సిటీ ఎక్స్ ప్రెస్ : 10, 11, 15, 18, 19, 20 తేదీల్లో క్యాన్సిల్.
విజయవాడ-సికింద్రాబాద్ (12713/12714) శాతవాహన ఎక్స్ ప్రెస్,: 11, 14, 16, 18, 19, 20 లేదీల్లో రద్దు చేస్తున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Also Read: బీజేపీ సీఎం రాజీనామా
ఆలస్యంగా నడిచే రైళ్లు
సికింద్రాబాద్- విశాఖపట్నం (20834) వందేభారత్ ఎక్స్ ప్రెస్: 19, 20 తేదీల్లో 75 నిమిషాలు లేటుగా నడవనుంది.
ఆదిలాబాద్-తిరుపతి (17406) కృష్ణా ఎక్స్ ప్రెస్: 9, 11, 14, 18, 19 తేదీల్లో 90 నిమిషాల పాటు ఆలస్యంగా నడవనుంది.
మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో బీసీ సభ
Also Read: గురుమూర్తి రిమాండ్ రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. అందుకే చంపేశాడు
Also Read: ప్రైవేట్ ఆసుపత్రులకు హెల్త్ మినిస్టర్ కీలక సూచన
Also Read: ఢిల్లీ సీఎం అభ్యర్థి ఫిక్స్.. అధిష్టానం చూపు అతడి వైపే
Also Read: దండకారణ్యంలో ఎన్‌కౌంటర్.. మావోయిస్టులకు భారీ దెబ్బ
For AndhraPradesh News And Telugu News
Updated Date - Feb 09 , 2025 | 09:47 PM