Seethakka: ఇంటింటి సర్వేతో లబ్ధిదారులను గుర్తించాం

ABN, Publish Date - Jan 23 , 2025 | 04:02 AM

రైతు భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారులను ప్రజాస్వామ్యబద్ధంగా గుర్తిస్తుంటే బీఆర్‌ఎస్‌ రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు.

Seethakka: ఇంటింటి సర్వేతో లబ్ధిదారులను గుర్తించాం
  • ఫామ్‌ హౌస్‌లో కూర్చొని ఎంపిక చేయలేదు: సీతక్క

హైదరాబాద్‌, జనవరి 22 (ఆంధ్రజ్యోతి): రైతు భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల లబ్ధిదారులను ప్రజాస్వామ్యబద్ధంగా గుర్తిస్తుంటే బీఆర్‌ఎస్‌ రాద్ధాంతం చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి సీతక్క పేర్కొన్నారు. సచివాలయంలో బుధవారం మీడి యా ప్రతినిధులతో ఆమె చిట్‌చాట్‌గా మాట్లాడారు. గత ప్రభుత్వ హయాం లో ఎమ్మెల్యేల ఇళ్లలో, ఫామ్‌ హౌస్‌ల్లో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరిగిందన్నారు. తాము వాళ్లలాగా అర్హులకు అన్యాయం చేయకుండా.. ఇంటింటి సర్వే చేపట్టి లబ్ధిదారులను గుర్తించినట్లు తెలిపారు.


సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చాక బీసీ కమిషన్‌ నివేదికకు ఆమోదం లభించే అవకాశం ఉందన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని ఆమె పేర్కొన్నారు. కాగా, బుధవారం సచివాలయంలోని తన చాంబర్‌లో మహిళా, శిశు సంక్షేమశాఖ ఉద్యోగ సంఘం క్యాలెండర్‌తో పాటు తెలంగాణ దివ్యాంగ ఉద్యోగుల వెల్ఫేర్‌ అసోసియేషన్‌ క్యాలెండర్‌ను మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ప్రజాపాలన లక్ష్యాలను ప్రజలకు చేరవేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగులదేనని అన్నారు.

Updated Date - Jan 23 , 2025 | 04:02 AM