Yadagirigutta: యాదగిరిగుట్టపై వైభవంగా సీతారామ కల్యాణోత్సవం
ABN, Publish Date - Apr 07 , 2025 | 04:10 AM
యాదగిరిగుట్టపై సీతారాముల కల్యాణోత్సవం శివాలయంలో కన్నుల పండువగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ వేడుకలు ప్రారంభం కాగా, ముందుగా పట్టు వస్త్రాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు.

యాదగిరిగుట్ట, సిరిసిల్ల, ఇల్లెందు రూరల్, చారకొండ, ఏప్రిల్ 6(ఆంధ్రజ్యోతి): యాదగిరిగుట్టపై సీతారాముల కల్యాణోత్సవం శివాలయంలో కన్నుల పండువగా జరిగింది. మధ్యాహ్నం 12 గంటలకు కల్యాణ వేడుకలు ప్రారంభం కాగా, ముందుగా పట్టు వస్త్రాలు, ఆభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. ఆలయం తూర్పు రాజగోపురం నుంచి స్వామి అమ్మవారిని వేద మంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య తిరువీధి సేవ నిర్వహించి ఉత్సవ మండపం వద్దకు చేర్చారు. దేవస్థానం తరపున కల్యాణ దంపతులకు పట్టువస్త్రాలను ఆలయ ఈవో అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వరస్వామి క్షేత్రంలో శ్రీరామనవమి వేడుకలను వైభవోపేతంగా నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య సీతారాముల కల్యాణం కన్నుల పండువగా నిర్వహించారు. నాగర్‌కర్నూల్ జిల్లా, చారకొండ మండల పరిధిలోని సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి దేవాలయంలో సీతారాముల కల్యాణాన్ని ప్రభుత్వ లాంఛనాలతో వైభవంగా నిర్వహించారు.
ఇల్లెందు దర్గాలో ముస్లింల ఆధ్వర్యంలో..
భద్రాద్రి జిల్లా ఇల్లెందులో ముస్లింలు దర్గాలో శ్రీరామనవమి ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఇల్లెందు మండలం సత్యనారాయణపురం సమీపంలోని హజరత్ నాగుల్‌మీరా దర్గాలో కులమతాలకు అతీతంగా ఉత్సవాలు నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. సోమవారం దర్గాలో శ్రీరామ పట్టాభిషేకం మహోత్సవం నిర్వహిస్తారు.
తిరుమలలో శ్రీరామనవమి ఆస్థానం
తిరుమల, ఏప్రిల్ 6 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి శ్రీరామనవమి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలోని బంగారువాకిలి వద్ద ఆస్థానాన్ని అర్చకులు వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపి తోమాలసేవ, అర్చన సేవలను నిర్వహించారు. తర్వాత ఆలయంలోని రంగనాయకమండపంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు శ్రీసీతారామలక్ష్మణ సమేత హనుమంత స్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజన సేవను కన్నులపండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పఠనం చేశారు. రాత్రి హనుమంత వాహనసేవ వేడుకగా నిర్వహించా రు. శ్రీరాములవారు తన భక్తుడైన హనుమంతునిపై కొలువుదీరి మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. కాగా, సోమవారం రాత్రి 8 నుంచి 9 గంట ల మధ్య శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
HCU Land: హెచ్‌సీయూ వివాదంలో నిజాలు ప్రచారం చేయండి
No Exam: ఈ అర్హత చాలు.. పరీక్ష లేకుండా ఉద్యోగం.. నెలకు రూ. 2 లక్షల జీతం
Water Conflict: నీటి పంచాయతీ.. అధికారులతో ఉత్తమ్ కీలక భేటీ
Healthy Soup: ఈ సూప్‌తో మీ శరీరంలో కొన్ని భాగాలకు ఊహించని శక్తి పక్కా
Cotton Clothing: కాటన్ దుస్తులు.. ఒరిజినలా? కాదా? ఎలా గుర్తించాలంటే..
Fake Cardiologist: ఏడుగురి ఉసురు తీసిన వైద్యుడు.. విచారణకు రంగం సిద్ధం
శ్రీలీలకి చేదు అనుభవం.. చెయ్యి పట్టుకుని లాగిన యువకులు
కేసు No.62.. సుప్రీంకోర్టులో మిథున్ రెడ్డి పిటిషన్ పై విచారణ
For Telangana News And Telugu News
Updated Date - Apr 07 , 2025 | 04:10 AM