Share News

Nalgonda: నీవు లేక నేనుండలేను..

ABN , Publish Date - Apr 15 , 2025 | 06:04 AM

కష్ట సుఖాల్లో కలకాలం తోడుగా కలిసుంటామని పెళ్లినాడు ప్రమాణాలు చేసుకున్న వారు కాటికి కూడా కలిసే వెళ్లారు. భర్త గుండెపోటుతో మృతి చెందగా, ఆ బాధను తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు విడించింది.

Nalgonda: నీవు లేక నేనుండలేను..

  • ఒకరోజు వ్యవధిలో గుండెపోటుతో భర్త, బాధతో భార్య మృతి

మునుగోడు రూరల్‌, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): కష్ట సుఖాల్లో కలకాలం తోడుగా కలిసుంటామని పెళ్లినాడు ప్రమాణాలు చేసుకున్న వారు కాటికి కూడా కలిసే వెళ్లారు. భర్త గుండెపోటుతో మృతి చెందగా, ఆ బాధను తట్టుకోలేక భార్య కూడా ప్రాణాలు విడించింది. నల్లగొండ జిల్లా మునుగోడు మండలంలోని పలివెలకు చెందిన దుబ్బ శంకరయ్య(67)కు లక్ష్మి(55)తో 30 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం లేకపోవడంతో ఓ అబ్బాయిని దత్తత తీసుకున్నారు.


గ్రామంలో ఉపాధి దొరక్క 15 ఏళ్ల క్రితం శంకరయ్య కుటుంబంతో హైదరాబాద్‌కు వలస వెళ్లారు. శంకరయ్య ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో వాచ్‌మెన్‌గా, లక్ష్మి వస్త్ర దుకాణంలో పని చేస్తూ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. కొన్ని నెలలుగా శంకరయ్య అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం గుండెపోటు గురై మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న లక్ష్మి బాధతో రోదించి రోదించి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఆమెను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందారు.

Updated Date - Apr 15 , 2025 | 06:04 AM