ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రీన్‌ హైడ్రోజన్‌కు కొత్త విజన్‌!

ABN, Publish Date - Jan 13 , 2025 | 04:10 AM

రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌, అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమలను పోత్సహించేందుకు ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. ఎలక్ర్టోలైజర్‌ స్టాక్‌ ప్లాంట్‌, పరికరాలపై 30 శాతం పెట్టుబడి రాయితీ ఇవ్వనుంది.

  • ఆ ప్లాంట్లకు భారీ రాయితీలు, ప్రోత్సాహకాలు

  • తెలంగాణ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ విధానం

హైదరాబాద్‌, జనవరి 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌, అనుబంధ ఉత్పత్తుల పరిశ్రమలను పోత్సహించేందుకు ప్రభుత్వం భారీ నజరానాలు ప్రకటించింది. ఎలక్ర్టోలైజర్‌ స్టాక్‌ ప్లాంట్‌, పరికరాలపై 30 శాతం పెట్టుబడి రాయితీ ఇవ్వనుంది. ప్రతి మెగావాట్‌ ఉత్పత్తి సామర్థ్యానికి రూ.కోటి చొప్పున గరిష్ఠంగా రూ.30 కోట్ల పెట్టుబడి రాయితీ లభిస్తుందని తెలంగాణ క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ ఎనర్జీ పాలసీ-2025లో ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ హైడ్రోజన్‌, గ్రీన్‌ అమోనియా, గ్రీన్‌ మిథనాల్‌ (బయోజనిక్‌ కార్బన్‌తో సహా) పరిశ్రమల ఏర్పాటుకు ప్రాధాన్యతనిచ్చింది. ప్రతి కేటీపీఏ సామర్థ్యానికి గ్రీన్‌ అమోనియా ప్లాంట్లకు రూ.1.85 కోట్లు, గ్రీన్‌ మిథనాల్‌ ప్లాంట్లకు రూ.2.25 కోట్ల వరకు సబ్సిడీలు అందించనుంది. ఉత్పాదనప్రారంభించాక ఐదేళ్లలో సబ్సిడీ చెల్లింపులు జరుగుతాయి. కనీసం 500 మెగావాట్ల వార్షిక ఎలక్ర్టోలైజర్‌ ఉత్పాదక సామర్థ్యం కలిగిన తొలి 5 ప్లాంట్లకే ఇది వర్తిస్తుంది. మహిళా పారిశ్రామికవేత్తలకు అదనంగా 10 శాతం పెట్టబడి రాయితీ లభిస్తుంది.


రాయితీలు, ప్రోత్సాహకాలు..

  • రాష్ట్రంలో గ్రీన్‌ హైడ్రోజన్‌, అనుబంధ ఉత్పత్తుల అమ్మకాలపై ఐదేళ్లపాటు, ఎలక్టోల్రైజర్‌, హైడ్రోజన్‌ ఫ్యూయల్‌ సెల్‌ పరిశ్రమల ఉత్పత్తుల అమ్మకాలపై ఏడేళ్ల పాటు 100ుఎస్‌జీఎస్టీ తిరిగి చెల్లిస్తుంది.

  • ప్రాజెక్టుల గుమ్మం వరకు నీటి సరఫరా సదుపాయం కల్పిస్తారు. గ్రీన్‌ హైడ్రోజన్‌ పరిశ్రమలకు నీటి సరఫరా చార్జీల్లో ఐదేళ్ల పాటు 50 శాతం తిరిగి చెల్లిస్తుంది. ఎలక్ర్టోలైజర్‌ పరిశ్రమలకు పదేళ్ల పాటు 25 శాతం నీటి చార్జీలు తిరిగి ఇస్తుంది.

  • గ్రీన్‌ హైడ్రోజన్‌ పరిశ్రమలకు పదేళ్ల పాటు, ఎలక్ర్టోలైజర్‌ పరిశ్రమలకు ఐదేళ్ల పాటు 100 శాతం ఎలక్ట్రిసిటీ డ్యూటీ మాఫీ చేస్తుంది.

  • గ్రీన్‌ హైడ్రోజన్‌ పరిశ్రమలు రాష్ట్ర డిస్కంల నుంచి కొనే ప్రతి యూనిట్‌ విద్యుత్‌కు రూ.3 చొప్పున 20 ఏళ్ల పాటు బిల్లులను తిరిగి చెల్లిస్తుంది. ఎలక్టోల్రైజర్‌ పరిశ్రమలకు ఐదేళ్ల పాటు యూనిట్‌ విద్యుత్‌పై రూపాయి చొప్పున రాయితీ వర్తిస్తుంది.

  • గ్రీన్‌ హైడ్రోజన్‌ రీ ఫ్యూయలింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు 30 శాతం పెట్టుబడి రాయితీని ప్రభుత్వం ఇవ్వనుంది. పరికరాల కొనుగోలుపై 100 శాతం ఎస్‌జీఎస్టీ రీయింబర్స్‌మెంట్‌ను ప్లాంట్‌లో ఉత్పాదన ప్రారంభమైన నాటి నుంచి ఐదేళ్లలో ఇస్తుంది.

  • గ్రీన్‌ హైడ్రోజన్‌ అంటే...

  • గ్రీన్‌ హైడ్రోజన్‌ స్వచ్ఛమైన ఇంధన వనరు. సౌర విద్యుత్‌, ఇతర పునరుత్పాదక విద్యుత్‌ను ఉపయోగించి నీటిని హైడ్రోజన్‌, ఆక్సిజన్‌గా విడగొడతారు. దీన్నే గ్రీన్‌ హైడ్రోజన్‌ అంటారు. భూతాపం, కర్బన ఉద్గారాల తగ్గింపు కోసం శిలాజ ఇంధనాలకు బదులు కాలుష్యరహిత గ్రీన్‌ హైడ్రోజన్‌ను వినియోగించాలని వివిధ దేశాల లక్ష్యం. వాహనాలతో పాటు భారీ పరిశ్రమల్లో వినియోగిస్తున్న కాలుష్య కారక ఇంధనాలకు బదులుగా గ్రీన్‌ హైడ్రోజన్‌ వినియోగిస్తే భవిష్యత్తులో ‘నెట్‌ జీరో’ లక్ష్యాన్ని అందుకోవచ్చని భావిస్తున్నారు.

Updated Date - Jan 13 , 2025 | 04:10 AM