విద్యుత్ సంస్కరణలకు సిద్ధం!
ABN , Publish Date - Apr 12 , 2025 | 04:33 AM
ఈ పథకం నిబంధనల అమలుకు అంగీకరిస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు), రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

ఆర్డీఎ్‌సఎస్, ఇతర పథకాల్లో చేరేందుకు పంపిణీ
సంస్కరణల కమిటీ ఏర్పాటు.. ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, ఏప్రిల్ 11 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణల అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రీవ్యాంప్డ్ డిస్ర్టిబ్యూషన్ సెక్టార్ స్కీం (ఆర్డీఎ్‌సఎ్‌స)తోపాటు ‘ధర్తి అబా జన్‌జాతీయ గ్రామ ఉత్కర్ష్ యోజన (డీఏజేజీయూఏ) ఇతరత్రా పథకాల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లకు తుదిరూపు ఇవ్వడంతోపాటు పథకాల అమలు పర్యవేక్షణకుగాను రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్కరణల కమిటీ(డీఆర్‌సీ)ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చైర్మన్‌గా, ఇంధన శాఖ ముఖ్యకార్యద ర్శి మెంబర్/కన్వీనర్‌గా, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, రెవెన్యూశాఖ ముఖ్యకార్యదర్శి, అటవీ పర్యావరణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్యులుగా, దక్షిణ డిస్కమ్ సీఎండీ, ఉత్తర డిస్కమ్ సీఎండీలు ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర పంపిణీ సంస్కరణల కమిటీని వేస్తూ ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి సందీ్‌పకుమార్ సుల్తానియా శుక్రవారం జీవో నం.13ను జారీ చేశారు. ఈ కమిటీ ఆర్డీఎ్‌సఎస్, డీఏజేజీయూఏలు, ఇతర కేంద్ర పథకాల్లో చేరడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది.
గిరిజన/ఆదివాసీ ప్రాంతాల్లో విద్యుదీకరణకు ఉద్దేశించి కేంద్రం డీఏజేజీయూఏను ప్రవేశపెట్టింది. కాగా ఆర్డీఎ్‌సఎ్‌సలో చేరేందుకు డీపీఆర్‌కు మంత్రివర్గం ఆమోదం తెలపాలి. ఈ పథకం నిబంధనల అమలుకు అంగీకరిస్తూ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు), రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య త్రైపాక్షిక ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని 27 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు మినహా మిగిలిన వినియోగదారులందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగించాల్సి ఉంటుంది. దక్షిణ డిస్కమ్ పరిధిలో ప్రీపెయిడ్ మీటర్లకు రూ.4వేల కోట్లు, సబ్‌స్టేషన్ల సామర్థ్యం పెంపు/నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల వృద్ధికి మరో రూ.5,000 కోట్ల ఖర్చవుతుందని అంచనావేశారు. ఉత్తర డిస్కమ్ పరిధిలో ప్రీపెయిడ్ మీటర్లకు రూ.2,800 కోట్లు, మౌలిక సదుపాయాల వృద్ధికి రూ.3,500 కోట్లు కానుందని లెక్కగట్టారు. దేశ వ్యాప్తంగా భారీ నష్టాల్లో ఉన్న డిస్కంలను మళ్లీ లాభాలబాట పట్టించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని తెచ్చింది. దీనికోసం ఏటా చార్జీలను సవరించాల్సి ఉంటుంది. దేశ వ్యాప్తంగా రూ.3.03లక్షల కోట్లతో ఈ పథకం అమలుకు కార్యాచరణను గతంలోనే ప్రకటించింది. ఇందులో రూ.97,631 కోట్లను కేంద్రం అందించనుంది. ఈ పథకంలో చేరితే రాష్ట్రంలోని రెండు డిస్కమ్‌లకు కేంద్రం నుంచి మొత్తంగా రూ.5వేల కోట్ల సాయం అందనుంది.