Share News

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..

ABN , Publish Date - Apr 13 , 2025 | 10:50 PM

మంచిర్యాల నియో జకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐబీ చౌరస్తాలో భారీ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. అంబేద్కర్‌ జయంతిని పురస్క రించుకొని చేపట్టనున్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్‌ హాజరవుతున్నట్లు తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు..
సమావేశంలో మాట్లాడుతున్న ప్రేంసాగర్‌రావు, పాల్గొన్న డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ

-నేటి నుంచి మహాప్రస్థానం అందుబాటులోకి

-అభివృద్ధిని వక్రీకరిస్తే సహించేదిలేదు

-మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు

మంచిర్యాల, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నియో జకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఐబీ చౌరస్తాలో భారీ అంబేద్కర్‌ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు తెలిపారు. అంబేద్కర్‌ జయంతిని పురస్క రించుకొని చేపట్టనున్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉప ము ఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్‌ హాజరవుతున్నట్లు తెలిపారు. అలాగే రాళ్లవాగు పక్కన కరకట్ట నిర్మాణానికి శంకు స్థాపనతోపాటు వివిధ పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పా రు. విగ్రహావిష్కరణ అనంతరం స్థానికంగా నిర్మాణంలో ఉన్న మాతా శిశు ఆసుపత్రి పనులను మంత్రులు పరిశీలిస్తారన్నారు. అక్కడి నుంచి ఓపెన్‌ టాప్‌ జీప్‌లో వాటర్‌ ట్యాంక్‌, జగదాంబ సెంటర్‌, మెయిన్‌రోడ్‌, అర్చన చౌరస్తా మీదుగా బాలుర పాఠశాల లో ఏర్పాటు చేసే బహిరంగ సభాస్థలి వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. బహిరంగ సభ సందర్భంగా కొత్త పథకాలను కూడా మంత్రులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయ న్నారు. సభకు 40 వేల మంది వరకు ప్రజలు, అభిమానులు హా జరవుతారని తెలిపారు. రాష్ట్రంలో 85 శాతం మంది రైతులకు రు ణమాఫీ జరిగిందని, సన్న బియ్యానికి బోనస్‌, ఉచిత బస్సు ప్ర యాణం, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్‌, ఉచిత బి య్యం పంపిణీతో ప్రజలకు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంద న్నారు. గత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేయడం వల్లే ప్రస్తుత ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు పడాల్సి వస్తోంద న్నారు. వేంపల్లిలో ఇండస్ట్రియల్‌ పార్కు కోసం బలవంతంగా భూ ములు లాక్కోవడం లేదని స్పష్టం చేశారు. మహా ప్రస్థానం మం గళవారం నుంచి వినియోగంలోకి వస్తుందని, నిరుపేదలకు ఉచి తంగా అంత్యక్రియలు చేసుకునేందుకు వెసులుబాటు ఇస్తు న్నా మని తెలిపారు. తాను చేసే అభివృద్ధి పనులను వక్రీకరిస్తే సహిం చేదిలేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షు రాలు కొక్కిరాల సురేఖ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనా రాయ ణ, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు పూదరి తిరుపతి, కాంగ్రెస్‌ పట్టణాధ్యక్షుడు తూముల నరేష్‌, మహిళా విభాగం పట్టణాధ్యక్షు రాలు గజ్జెల హేమలత, తాజా మాజీ కౌన్సిలర్లు సల్ల మహేష్‌, రామగిరి భానేష్‌, పాల్గొన్నారు.

Updated Date - Apr 13 , 2025 | 10:50 PM