ఆగని నకిలీ పత్తి విత్తనాల దందా...!
ABN , Publish Date - Apr 01 , 2025 | 11:16 PM
పత్తి సీజన్ సమీపిస్తున్న తరుణంలో నకిలీ విత్తనాల ఆక్రమ ర వాణా ఆందోళనకు దారి తీస్తోంది. అమాయకపు రైతులే లక్ష్యంగా స్మగ్లర్లు పెద్ద మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంగా రూ. కోట్లు విలువ చేసే నకిలీ దందా జో రుగా సాగుతోంది. పోలీసుల కళ్లు గప్పి వివిధ రాష్ట్రా ల నుంచి స్మగ్లర్లు గుట్టు చప్పుడు కాకుండా పెద్ద మొత్తంలో నకిలీ సరుకును జిల్లాకు తరలిస్తున్నారు.

-మంచిర్యాల కేంద్రంగా రూ. కోట్ల వ్యాపారం
-వివిధ రాష్ట్రాల నుంచి జిల్లాకు దిగుమతి
అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ నజర్
మంచిర్యాల, ఏప్రిల్ 1 (ఆంధ్రజ్యోతి): పత్తి సీజన్ సమీపిస్తున్న తరుణంలో నకిలీ విత్తనాల ఆక్రమ ర వాణా ఆందోళనకు దారి తీస్తోంది. అమాయకపు రైతులే లక్ష్యంగా స్మగ్లర్లు పెద్ద మొత్తంలో నకిలీ పత్తి విత్తనాలు సరఫరా చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంగా రూ. కోట్లు విలువ చేసే నకిలీ దందా జో రుగా సాగుతోంది. పోలీసుల కళ్లు గప్పి వివిధ రాష్ట్రా ల నుంచి స్మగ్లర్లు గుట్టు చప్పుడు కాకుండా పెద్ద మొత్తంలో నకిలీ సరుకును జిల్లాకు తరలిస్తున్నారు. విడి విత్తనాలు, బట్ట సంచుల్లో ప్యాక్ చేసిన నకిలీ విత్తనాలను నేరుగా రైతులకు అంటగడుతున్నారు. కొందరు అక్రమార్కులు ముఠాగా ఏర్పడి రవాణా చేస్తున్నారు. జిల్లాలోని కొందరు డీలర్లతో సత్సంబం ధాలు నెరుపుతున్న సదరు ముఠా సభ్యులు తక్కువ ధరకు వారికి సరఫరా చేస్తున్నారు. లైసెన్స్‌డ్ డీలర్ల కంటే బయటి వ్యక్తుల వద్ద విత్తనాలు చవకగా లభి స్తుండటంతో రైతులు వాటిని కొనేందుకు ఆసక్తి కన బరుస్తున్నట్లు తెలుస్తోంది. నాణ్యమైన విత్తనాలతో చేసే సాగుతో పోల్చితే నకిలీ విత్తనాలతో చేసే సాగు కు పెట్టుబడిలో భారీగా వ్యత్యాసాలు ఉండటంతో రైౖ తులు వాటిపై వైపే మొగ్గు చూపుతున్నారు. నకిలీ విత్తనాల సరఫరాను నియంత్రించేందుకు పోలీసులు దాడులు చేస్తున్నా అక్రమ దందా కొనసాగుతుండ టం గమనార్హం. నకిలీ విత్తనాల దుష్ప్రభావం, వాటి వల్ల కలిగే నష్టాలపై వ్యవసాయ, పోలీసులు శాఖ లు సంయుక్తంగా రైతులకు అవగాహన కల్పిస్తున్నా ఆశించిన ఫలితం ఉండటం లేదు.
వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి...
జిల్లాకు ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ పత్తి విత్తనా లు దిగుమతి అవుతున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల నుంచి ఈ నకిలీ విత్తనాలు జిల్లాకు చేరు కుంటున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని గుం టూరు, కర్నూలు, ప్రకాశం, నంద్యాల నుంచి పెద్ద మొత్తంలో సరఫరా అవుతున్నట్లు పోలీసులు అను మానిస్తున్నారు. ఆయా ప్రాంతాలకు చెందిన పలువు రు వ్యక్తులు నకిలీ పత్తి విత్తనాలను తయారు చేసి, అక్కడి నుంచి అక్రమంగా జిల్లాలోని రైతులకు విక్రయిస్తున్నారు. స్మగ్లర్లు నకిలీ విత్తనాలను ఉమ్మడి క రీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలకు నిత్యావసర వస్తువు లు తరలించే వాహనాల్లో రహస్యంగా తరలిస్తున్నా రు. ఆంరఽఽధకు చెందిన కొందరు పత్తిసాగు పేరుతో జిల్లాలోని మందమర్రి, బెల్లంపల్లి, జైపూర్, తదితర ప్రాంతాలలో నివాసం ఉంటారు. ఇక్కడి భూముల ను కౌలుకు తీసుకొని నామ మాత్రంగా వ్యవసా యం చేస్తూ ఇక్కడి విత్తన డీలర్లు, రైతులతో పరిచ యాలు పెంచుకుంటారు. వారికి అనుకూలంగా ఉ న్న వారితో ముఠాలను ఏర్పాటు చేసుకొని నకిలీ ప త్తి విత్తనాలను రవాణా చేస్తారు. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ పోలీసులు జరిపిన దాడుల్లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన పలువురు వ్యక్తులు పట్టుబడట మే దీనికి నిదర్శనం.
నకిలీ విత్తనాలతో దుష్ప్రభావం...
పోలీసుల దాడుల్లో అధికంగా పట్టుబడుతున్న వా టిలో నిషేదిత (బీటీ-3) విత్తనాలతోపాటు హెచ్‌టీ కాటన్ (హెర్బిసైడ్ టాలరెన్స్) అధికంగా ఉంటున్నా యి. ఇవి జన్యు మార్పిడి చేసిన పత్తి విత్తనాలుగా వ్యవసాయ అధికారులు, పోలీసులు పేర్కొంటు న్నా రు. ఈ విత్తనాలు గ్లైఫోసెట్ అనే కలుపు మందును తట్టుకుంటాయి. ఈ కలుపు మందు పత్తి పంటను కాకుండా మిగతా అన్ని కలుపు మొక్కలను నాశనం చేస్తుంది. అయితే గ్లైఫోసెట్ మందు క్యాన్సర్ కారక మని రుజువు కావడంతోపాటు పర్యావరణానికి కూ డా హాని కలిగిస్తున్నందున ప్రభుత్వం దాన్ని నిశేధిం చింది. హెచ్‌టీ కాటన్‌తో పర్యావరణంతో పాటు ప్రా ణులపై పడే ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ చవ కగా లభిస్తున్నందున రైతులు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా నిషేధిత విత్తనాల కారణంగా భూసారం దెబ్బతినే ప్రమాదం ఉంది. భూములను కౌలుకు తీసుకుని సాగు చేసే వారికి భూమి జీవితకాలంతో సంబంధం లేకుండా అధిక దిగుబడే లక్ష్యంగా ఉంటుంది. ఈ కా రణంగా కైలు రైతులు నిషేధిత విత్తనాల వైపు అధి కంగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి.
విత్తన భారంతో....
పత్తి రైతులపై విత్తన భారం ఏటా పెరుగుతూనే ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నయా పైసా సబ్సిడీ లేకపోవడం, ప్రైవేటు విత్తన కంపెనీలు, డీల ర్ల నుంచి కొనుగోలు చేయాల్సి రావడం రైతులకు శా పంగా మారుతోంది. తాజాగా కేంధ్ర వ్యవసాయ శా ఖ పత్తి విత్తనాల ధరలు పెంచుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా బీజీ-2 475 గ్రా ముల పత్తి విత్తన ప్యాకెట్ ధరను రూ. 901గా నిర్ణ యించింది. గత ఏడాది అదే ప్యాకెట్ ధర రూ. 864 ఉండగా, ఈ ఏడాది రూ. 37 అదనంగా పెంచింది. గడిచిన గడిచిన ఐదేళ్లలో ఏకంగా రూ. 134 పెరిగిం ది. జిల్లాలో.. ప్రతి ఏటా సగటున లక్షా యాబై వేల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. పంట చేతికి వచ్చే స రికి రైతులు మూడు సార్లు మందు వినియోగిస్తా రు. దీంతో విత్తనాలకే రూ. 3వేల పై చిలుకు వె చ్చించాల్సి రావడంతో రైతులు చవకగా లభించే బీటీ, గ్లైపొసెట్ మందుల వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
అక్రమ రవాణాపై టాస్క్’ఫోర్స్’....
నకిలీ పత్తి విత్తనాల అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రామగుండం కమిషనరేట్‌లోని టాస్క్‌ఫో ర్స్ పోలీసులు మెరుపు దాడులకు ప్పాలడుతున్నారు. కల్తీ, నకిలీ విత్తనాల రూపుమాపి, రైతులకు అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయా ల కు అనుగుణంగా టాస్క్‌ఫోర్స్ బృందాలు, స్థానిక పో లీసులు, వ్యవసాయశాఖ అధికారులతో కలిసి కృషి చేస్తున్నారు. గతనెల 26న మందమర్రిలో రూ. 7,87,500 విలువగల 315 కిలోల పత్తి విత్తనాలు ప ట్టుబడటమే దీనికి నిదర్శనం.
కఠిన చర్యలు తీసుకుంటాం...
మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్
ఫర్టిలైజర్ షాపుల్లో నకిలీ విత్తనాలు, గైసిల్ గడ్డి మందు విక్రయాలు జరిపే వారిపై కఠిన చర్యలు తీ సుకుంటాం. ప్రభుత్వ సూచనలు, నిబంధనలకు అ నుగుణంగా డీలర్లు విక్రయాలు సాగించాలి. నిశేధిత విత్తనాలు వాడే రైతులకూ తీరని నష్టం వాటిల్లుతుం ది. నకిలీ విత్తనాలు విక్రయించే ముఠా సభ్యుల స మాచారం తెలిస్తే స్థానిక పోలీసులకు తెలియజే యాలి. జిల్లాలోకి నకిలీ విత్తనాల ముఠా ప్రవేశించే అవకాశాలున్న అన్ని బార్డర్ల వద్ద గట్టి నిఘా ఏర్పా టు చేశాం. నకిలీ విత్తనాల సరఫరాను ప్రోత్సహించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోము. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ సహకారంతో నకిలీ విత్తనా లపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం.