Share News

Mahesh Kumar Goud: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ పరోక్ష మద్దతు: మహేశ్‌ గౌడ్‌

ABN , Publish Date - Feb 10 , 2025 | 04:11 AM

లోక్‌సభ ఎన్నికల మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీకి బీఆర్‌ఎస్‌ పరోక్షంగా మద్దతు ఇస్తోందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు.

Mahesh Kumar Goud: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్‌ఎస్‌ పరోక్ష మద్దతు: మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ ఎన్నికల మాదిరిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ బీజేపీకి బీఆర్‌ఎస్‌ పరోక్షంగా మద్దతు ఇస్తోందని టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఆరోపించారు. పోటీ చేయడానికి బీఆర్‌ఎ్‌సకు అభ్యర్థులు కరువయ్యారని, దీంతో ఈ మేరకు ఆ రెండు పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కుదిరిందన్నారు. ఎలాంటి ఆధారం చూపకుండా బీసీ కులగణన తప్పుల తడకంటూ కేటీఆర్‌ ఎలా మాట్లాడతారని ఆదివారం ఓ ప్రకటనలో ప్రశ్నించారు.


లక్ష మందికి పైగా సిబ్బందితో శాస్త్రీయంగా కులగణన సర్వేని నిర్వహించిన కాంగ్రెస్‌ సర్కారుకు పేరు రావడం భరించలేకే కేటీఆర్‌ ఏదేదో మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. కులగణన సర్వేలో పాల్గొనని కేటీఆర్‌, ఆయన కుటుంబ సభ్యులు.. రీ సర్వే గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

Updated Date - Feb 10 , 2025 | 04:11 AM