ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Jaggareddy: కేజ్రీవాల్‌.. రాహుల్‌ను డామినేట్‌ చేయలేరు

ABN, Publish Date - Feb 11 , 2025 | 05:11 AM

ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ది.. రాహుల్‌గాంధీని డామినేట్‌ చేసే పర్సనాలిటీ కానే కాదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి అన్నారు.

జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఆప్‌కు లేదు

  • ఎన్నికల వేళ కేజ్రీవాల్‌కు అహంకారం పెరిగింది

  • కాంగ్రె్‌సతో పొత్తుండదని ఏకపక్షంగా ప్రకటించారు

  • ఎన్నికల్లో అందుకు తగ్గ మూల్యం చెల్లించుకున్నారు

  • ఒంటరి పోరుకు సిద్ధం కావాలని ఢిల్లీ ఎన్నికల ద్వారా క్యాడర్‌కు రాహుల్‌గాంధీ సంకేతం

  • టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి

హైదరాబాద్‌, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ది.. రాహుల్‌గాంధీని డామినేట్‌ చేసే పర్సనాలిటీ కానే కాదని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తూర్పు జగ్గారెడ్డి అన్నారు. జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే శక్తి ఆమ్‌ ఆద్మీ పార్టీకి లేనే లేదన్నారు. గాంధీభవన్‌లో సోమవారం నాడు మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ ఢిల్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషించారు. ఢిల్లీ ఎన్నికల ముందు కేజ్రీవాల్‌లో అహంకారం పెరిగిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీతో పొత్తు ఉండబోదంటూ ఏకపక్షంగా ప్రకటనలు చేశారని గుర్తు చేశారు.


ఆయన అహంకారానికి ఎన్నికల తర్వాత తగిన మూల్యం చెల్లించుకున్నారన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఒంటరిగా వెళ్లడం ద్వారా అక్కడ కాంగ్రెస్‌ పార్టీని బలోపేతం చేయాలని రాహుల్‌గాంధీ భావించి ఉండొచ్చని తెలిపారు. ఒంటరిగా కొట్లాడటానికి సిద్ధం కావాలటూ ఈ ఎన్నికల ద్వారా పార్టీ శ్రేణులకు ఆయన సంకేతం ఇచ్చారని తాను భావిస్తున్నానన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమన్నారు. ఈ రోజున ఢిల్లీలో బీజేపీ గెలిచిందని, వచ్చే ఎన్నికల్లో అక్కడ పోటీలో ఉండేది కాంగ్రెస్‌ పార్టీనేనని అన్నారు.


మరిన్ని తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Also Read : కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికకు వెల్లువెత్తిన నామినేషన్లు

Also Read: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డి

For Telangana News And Telugu News

Updated Date - Feb 11 , 2025 | 05:11 AM