ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

తిరుపతి ఘటన దిగ్ర్భాంతికరం..

ABN, Publish Date - Jan 09 , 2025 | 03:56 AM

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర బుధవారం జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

  • సీఎం రేవంత్‌, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల కోసం తిరుపతిలోని విష్ణు నివాసం దగ్గర బుధవారం జరిగిన తొక్కిసలాటలో పలువురు భక్తులు మృతి చెందడం తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసిందని సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. తొక్కిసలాటలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.


ఈ ఘటనపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా స్పందించారు. ‘తిరుపతిలో తొక్కిసలాట జరిగి పలువురు భక్తులు మృతి చెందిన ఘటన దిగ్ర్భాంతికరం. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి. ఈ విషయంపై ఏపీ మంత్రి నారా లోకేశ్‌, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడితో మాట్లాడాను. క్షతగాత్రులకు మెరుగైన సేవలందించాలని కోరాను’ అని తెలిపారు.

Updated Date - Jan 09 , 2025 | 03:56 AM