ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Festival Travel: ఎలాగైనా ఊరెళ్తాం..

ABN, Publish Date - Jan 13 , 2025 | 04:26 AM

ఎలాగైనా పండగకి ఇంటికి వెళ్లాలి.. కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చెయ్యాలి.. సొంతూరిని వదిలి ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వారి ఆలోచన ఇది.

  • మూడు రోజుల్లో ఏపీ వైపునకు 60 వేలకు పైగా బైక్‌లు

  • బస్సులు, రైళ్లలో చార్జీల మోత.. తాళలేక బైక్‌లపై సొంతూళ్లకు

  • కార్లలోనూ పలువురి ప్రయాణం.. టోల్‌గేట్ల వద్ద బారులు

  • సంక్రాంతి ప్రభావంతో హైదరాబాద్‌ రహదారులు ఖాళీ

(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌): ఎలాగైనా పండగకి ఇంటికి వెళ్లాలి.. కుటుంబంతో కలిసి ఎంజాయ్‌ చెయ్యాలి.. సొంతూరిని వదిలి ఇతర ప్రాంతాల్లో ఉపాధి పొందుతున్న వారి ఆలోచన ఇది. దీనిని వ్యాపార వస్తువుగా మార్చుకున్న రవాణా సంస్థలు ప్రత్యేక సర్వీసుల పేరిట చార్జీల మోత మోగిస్తున్నాయి. ఆర్టీసీ, ప్రైవేటు ట్రావెల్స్‌, రైళ్లు అన్నింటిలోనూ ఈ ప్రత్యేక బాదుడు ఉంది. సాధారణ రోజుల్లో హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బస్సును బట్టి సుమారు రూ.500 నుంచి ప్రారంభమయ్యే టికెట్‌ ధర.. ఈ పండగ సీజన్‌లో వేలకు చేరింది. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ అయితే టికెట్‌ ధరలను మూడింతల దాకా పెంచేశాయి. ఈ ధరలను భరించలేక కొందరు తమ ప్రయాణాలు వాయిదాలు వేసుకుంటే.. మరికొందరు ఎలాగైనా సరే సొంతూరికి వెళ్లాలని ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నారు. ఎలాగైనా పండగకు ఇంటికి వస్తామంటూ.. కార్లు ఉన్న వారు తమ వాహనాల్లోనే ప్రయాణమవుతుంటే మరికొందరు ద్విచక్రవాహనాలపై వెళ్లిపోతున్నారు. దూరం, ప్రమాదాన్ని లెక్క చేయకుండా బైక్‌పై రోడ్డు ఎక్కేస్తున్నారు.


హైదరాబాద్‌ నుంచి రాష్ట్రంలోని స్వగ్రామాలకే కాక.. ఏపీలోని విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాలకు ద్విచక్రవాహనాలపై వెళుతున్న వారు వేలల్లో ఉంటున్నారు. గత మూడు రోజుల్లో 60 వేలకు పైగా ద్విచక్రవాహనాలు ఏపీ వైపు వెళ్లాయని హైదరాబాద్‌- విజయవాడ జాతీయ రహదారిలోని కొర్లపహాడ్‌ టోల్‌గేట్‌ సిబ్బంది తెలిపారు. కార్లు ఉన్న వారు తమ వాహనంలో దూర ప్రయాణాలు చెయ్యడం సహజమే కానీ బైక్‌లపై ఇలా దూరప్రయాణాలు చేసే వారి సంఖ్య పెరగడం గమనార్హం. ఇలా, హైదరాబాద్‌ నుంచి విజయవాడకు బైక్‌పై వె ళుతున్న ఓ వ్యక్తిని ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని కొమరబండ వైజంక్షన్‌ వద్ద ఆదివారం ఉదయం ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్రవాహనదారుడు స్వల్ప గా యాలతో బయటపడ్డాడు. మొత్తంగా గత మూడు రోజుల్లో రెండు లక్షలకు పైగా వాహనాలు ఏపీ వైపు వెళ్లాయని టోల్‌గేట్‌ల సిబ్బంది చెబుతున్నారు. హైదరాబాద్‌- విజయవాడ మార్గంతోపాటు రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలను చేరుకునే ర హదారులు పండగ ప్రయాణాలతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిలో మూడు రోజులుగా కొనసాగుతున్న రద్దీ ఆదివారం సాయంత్రానికి సాధారణ స్థితికి చేరింది.


హైదరాబాద్‌ ట్రాఫిక్‌కు బ్రేక్‌

ప్రతి నిత్యం ప్రజల ఉరుకులు, పరుగులతో బిజీబిజీగా ఉండే హైదరాబాద్‌ నగరానికి చిన్న విరామం దొరికింది. సంక్రాంతి పండగను కుటుంబసభ్యులతో జరుపుకోవాలని పెద్దసంఖ్యలో నగరవాసులు శుక్రవారం సాయంత్రం నుంచి సొంతూళ్ల బాటపట్టారు. దీంతో రాష్ట్ర రాజధాని మూడు రోజులుగా ఖాళీ అవుతోంది. వెరసి ట్రాఫి క్‌ టెన్షన్‌ నుంచి హైదరాబాదీలకు కాసింత ఉపశమనం లభించింది. కొన్ని రహదారులైతే నిర్మానుష్యంగా మారాయి.

మొదలైన ఐనవోలు మల్లన్న జాతర

ఐనవోలు, జనవరి 12(ఆంధ్రజ్యోతి): జానపదుల జాతరగా పేరొందిన హనుమకొండ జిల్లా ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర ప్రారంభమైంది. మకర సంక్రమణంతో ప్రారంభమై ఉగాది వరకు జాతర జరుగనుంది. భోగి, సంక్రాంతి రోజుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి లక్షల సంఖ్యలో భక్తులు జాతరకు తరలివస్తారు.


సీఎం రేవంత్‌ సంక్రాంతి శుభాకాంక్షలు

సంక్రాంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్‌ రెడ్డి తెలుగు ప్రజలందరికీ ఆదివారం శుభాకాంక్షలు తెలిపారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలు ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలోని దాదాపు కోటిమంది రైతులు, నిరుపేదలు, వ్యవసాయకూలీల కుటుంబాల్లో ఈ సంక్రాంతి కొత్తవెలుగులు తెస్తుందన్నారు.

నేటి నుంచి కైట్‌, స్వీట్‌ ఫెస్టివల్‌

సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మూడు రోజులు పాటు జరిగే ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫెస్టివల్‌, స్వీట్‌ ఫెస్టివల్‌ సోమవారం సాయంత్రం ప్రారంభం కానుంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

Updated Date - Jan 13 , 2025 | 04:26 AM