Tummala: సంక్రాంతి లోపు వ్యవసాయశాఖలో పదోన్నతులు!
ABN, Publish Date - Jan 04 , 2025 | 05:01 AM
వ్యవసాయశాఖలో ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న పదోన్నతుల ప్రక్రియను సంక్రాంతిలోపు పూర్తిచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.
ముఖ్యమంత్రితో చర్చించి సమస్యల పరిష్కారానికి కృషి
రాష్ట్ర అగ్రి డాక్టర్ల సంఘం సమావేశంలో మంత్రి తుమ్మల
వ్యవసాయశాఖలో ఏళ్ల తరబడి వాయిదా పడుతూ వస్తున్న పదోన్నతుల ప్రక్రియను సంక్రాంతిలోపు పూర్తిచేస్తామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వెంటనే మొదలు పెట్టాలని, వీలైతే వారం రోజుల్లోనే అర్హులైన అధికారులందరికీ పదోన్నతులు ఇవ్వాలని వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావును ఆదేశించారు.
తెలంగాణ అగ్రి డాక్టర్ల సంఘం(టాడా) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో శుక్రవారం నిర్వహించిన 2025 నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ, సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాల్లో మంత్రి తుమ్మల ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వ్యవసాయశాఖలో క్షేత్ర స్థాయి అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి పరిష్కారానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.
Updated Date - Jan 04 , 2025 | 05:01 AM