Chevella: చిన్నారుల ఉసురు తీసిన కారు
ABN , Publish Date - Apr 15 , 2025 | 05:57 AM
కార్లు డోర్లు లాకై ఇద్దరు చిన్నారులు ఊపిరాడక.. ప్రాణాలొదిలారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దామరిగిద్ద గ్రామంలో జరిగిందీ విషాదం. పిల్లలిద్దరూ తమ మేనమామ పెళ్లి కోసం తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మ ఇంటికొచ్చి మృత్యువాతపడ్డారు.

డోర్ లాక్‌తో ఊపిరాడక ఇద్దరి మృతి
చేవెళ్ల, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): కార్లు డోర్లు లాకై ఇద్దరు చిన్నారులు ఊపిరాడక.. ప్రాణాలొదిలారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని దామరిగిద్ద గ్రామంలో జరిగిందీ విషాదం. పిల్లలిద్దరూ తమ మేనమామ పెళ్లి కోసం తల్లిదండ్రులతో కలిసి అమ్మమ్మ ఇంటికొచ్చి మృత్యువాతపడ్డారు. మృతులు తన్మయిశ్రీ(5), అభినయశ్రీ(4). దామరిగిద్దకి చెందిన రాంబాబు పెళ్లి ఈ నెల 30న జరగనుంది. అతని అక్కాచెల్లెళ్లు ఉమారాణి, జ్యోతి తమ పిల్లలతో సోదరుడి వివా హం కోసం పుట్టింటికొచ్చారు. ఉమారాణికి ఓ బాబు, కూతురు తన్మయిశ్రీ ఉన్నారు. జ్యోతికి ముగ్గురు ఆడపిల్లల్లో అభినయశ్రీ ఓ సంతా నం.
సోమవారం తన్మయిశ్రీ, అభినయశ్రీ ఇంటి ముందు ఉన్న రాంబాబు కారు వెను క డోర్లు తెరిచి ఎక్కారు. లోపలి నుంచి డోర్లు క్లోజ్ చేసుకోవడం తో వెంటనే లాక్ అయ్యాయి. మధ్యాహ్నం 2గంటలకు వారి కోసం అందరూ వెతికితే ఎక్కడా కనిపించలేదు. చివరికి కారు డోర్ లాక్ తీసి చూడగా పిల్లలిద్దరూ అచేతన స్థితిలో కనిపించారు. వెంటనే చేవెళ్లలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరూ మృతిచెందినట్లు వైద్యులు చెప్పారు. ఘటనపై కేసు నమోదైంది.