Secundrabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో మహిళ ప్రసవం..
ABN, Publish Date - Mar 13 , 2025 | 11:04 AM
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఓ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. విశాఖపట్టణం వెళ్లేందుకు స్టేషన్ కు కుటుంబ సభ్యులుతో కలిసి స్టేషన్ కు వచ్చింది. ఈలోగా ఆమెకు పురిటి నొప్పులు అధికం కావడంతో అక్కడే ప్రసవించింది.

- తల్లీబిడ్డ క్షేమం..‘గాంధీ’కి తరలించిన ఆర్పీఎఫ్ పోలీసులు
సికింద్రాబాద్: పురిటినొప్పులతో బాధపడుతున్న ఓ మహిళ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్(Secundrabad Railway Station)లోనే ఆడశిశువువుకు జన్మనిచ్చింది. దుండిగల్‌కు చెందిన తబ్బామాజి గర్భవతి. విశాఖపట్నం(Vishakapatnam) వెళ్లేందుకు భర్తతో కలిసి బుధవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాం నంబర్ 6కి చేరుకున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Secunderabad: నరకొద్దు.. తరలిద్దాం.. 4,230 చెట్ల ట్రాన్స్‌లొకేషన్‌కు హెచ్‌ఎండీఏ నిర్ణయం
ఆమెకు పురిటి నొప్పులు రావడంతో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ ఎస్‌ఐ ఎండీ మహేష్(RPF SI Mahesh)తోపాటు మహిళా కానిస్టేబుళ్లు ప్రసవం కోసం సపర్యలు చేశారు. ఆడబిడ్డకు జన్మనిచ్చింది. వైద్య పరీక్షల నిమిత్తం తల్లీబిడ్డను అంబులెన్స్‌లో గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు చెప్పారని ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి:
మటన్ వండలేదని.. భార్యను కొట్టి చంపిన భర్త
Read Latest Telangana News and National News
Updated Date - Mar 13 , 2025 | 11:04 AM