ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Viral News: కర్రతో చితక్కొట్టి.. ఆపై ఉరివేసి

ABN, Publish Date - Jan 03 , 2025 | 03:22 AM

మద్యానికి బానిసైన భర్త వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తానే తుది తీర్పు ఇచ్చింది. భర్తను కర్రతో చితక్కొట్టి.. ఆపై నడిరోడ్డుపై ఉరివేసి చంపేసింది.

  • నడిరోడ్డుపై భర్తను హత్య చేసిన భార్య

  • మద్యానికి బానిసై తీవ్రంగా వేధిస్తున్నందుకే..

  • ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో ఘటన

  • వీడియో వైరల్‌ కావడంతో తీవ్ర సంచలనం

(బాపట్ల, ఆంధ్రజ్యోతి)

మద్యానికి బానిసైన భర్త వేధింపులకు ఆ మహిళ విసిగిపోయింది. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీలు జరిగినా భర్త ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో తానే తుది తీర్పు ఇచ్చింది. భర్తను కర్రతో చితక్కొట్టి.. ఆపై నడిరోడ్డుపై ఉరివేసి చంపేసింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. కేసు వివరాల ప్రకారం.. ఏపీలోని బాపట్ల జిల్లా అడవుల దీవి ఠాణా పరిధిలోని కొత్తపాలేనికి చెందిన అరుణతో గోకర్ణమఠం గ్రామానికి చెందిన అమరేంద్రబాబుకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. అమరేంద్ర మద్యానికి బానిసై నిత్యం భార్య అరుణను వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలో కుటుంబ పెద్దల సమక్షంలో పలుసార్లు పంచాయితీలు జరిగాయి. అయినా అమరేంద్రబాబు వ్యవహారశైలిలో మార్పు రాకపోగా, వేధింపులు మరింత పెరిగాయి.


అమరేంద్రబాబు, అరుణల మధ్య కొత్తపాలెంలో గత నెల 31న (మంగళవారం) తీవ్ర ఘర్షణ జరిగింది. ఏళ్లుగా ఓపిక పడుతూ వస్తున్న అరుణ తన భర్తపై కర్రతో తీవ్రంగా దాడి చేసి అక్కడే చంపేసింది. ఈ హత్యపై మృతుడి తండ్రి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఫిర్యాదులో వివరాల మేరకు అరుణ తన భర్తను కర్రతో కొట్టి చంపినట్లు పోలీసులు భావించారు. అయితే తన భర్తను తీవ్రంగా కర్రతో కొట్టిన తర్వాత కూడా అరుణ కోపం చల్లారలేదు. అమరేంద్రను నడిరోడ్డుపైకి లాక్కొచ్చి ఉరివేసి, మెడపై కాలువేసి అదిమిపట్టి చంపినట్లు ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో గురువారం వైరల్‌ అయింది. దీంతో ఈ దారుణ ఘటన తీవ్ర చర్చకు దారి తీసింది. వైరల్‌ అయిన వీడియో దృశ్యాల ఆధారంగా కేసులో సెక్షన్ల నమోదుపై పోలీసులు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

Updated Date - Jan 03 , 2025 | 03:22 AM