Share News

Nalgonda: మందుబాబులను పట్టిస్తే 10 వేల నజరానా

ABN , Publish Date - Feb 13 , 2025 | 04:20 AM

మద్యం తాగి గ్రామంలో తిరిగేవారిని గుర్తించి సమాచారమిస్తే రూ.10 వేల నజరానా ఇస్తామని మహిళా సంఘం నేతలు ప్రకటించారు.

Nalgonda: మందుబాబులను పట్టిస్తే 10 వేల నజరానా

  • బెల్టు దుకాణం నిర్వహిస్తే రూ.లక్ష, తాగితే 20వేల జరిమానా

  • నల్లగొండ జిల్లా ఏపూరులో నిర్ణయం

చిట్యాల రూరల్‌, లింగంపేట, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): మద్యం తాగి గ్రామంలో తిరిగేవారిని గుర్తించి సమాచారమిస్తే రూ.10 వేల నజరానా ఇస్తామని మహిళా సంఘం నేతలు ప్రకటించారు. బుధవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండలం ఏపూరులో మహిళలు, గ్రామస్థులు భారీ ప్రదర్శన నిర్వహించారు. గ్రామంలో తక్షణమే బెల్టు దుకాణాలు మూసివేయాలని, సిగరెట్లు విక్రయించవద్దని డిమాండ్‌ చేశారు. ఈ నెల 5న ఏపూరు యువకుడు మద్యం తాగి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 10న మృతి చెందాడు. ఈ ఘటన తమను ఎంతో కలిచివేసిందని మహిళలు తెలిపారు. ఈ నేపథ్యంలో మద్యం విక్రేతలకు రూ.లక్ష జరిమానా, మద్యం తాగిన వారికి రూ.20 వేల జరిమానా విధించనున్నట్లు గ్రామపంచాయతీ వద్ద గ్రామస్థులు నిర్ణయించారు. మద్యం తాగిన వారిని పట్టిస్తే రూ.10వేల బహుమతి ఇవ్వనున్నట్లు తెలిపారు. పో లీసులు, ఎక్సైజ్‌ అధికారులు గ్రామంలో బెల్టుషాపు లు లేకుండా చర్యలు తీసుకోవాలని, లేకుంటే పోలీ్‌సస్టేషన్‌ను ముట్టడిస్తామని వారు హెచ్చరించారు.


కామారెడ్డి జిల్లా సజ్జన్‌పల్లిలోనూ..

తమ గ్రామంలో ఎవరైనా మద్యం విక్రయిస్తే రూ.లక్ష జరిమానా విధిస్తామని కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం సజ్జన్‌పల్లి గ్రామస్థులు బుధవారం ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మద్యం విక్రయిస్తే తామే ఎక్సైజ్‌ అధికారులకు సమాచారం ఇచ్చి కేసులు నమోదు చేయిస్తామన్నారు.

Updated Date - Feb 13 , 2025 | 04:20 AM