ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఇద్దరు సీఎంలనూ ఆహ్వానించాం

ABN, Publish Date - Jan 03 , 2025 | 04:41 AM

ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఆహ్వానించామని ఆ సంస్థ అధ్యక్షురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్‌ వీఎల్‌ ఇందిరాదత్‌ తెలిపారు.

  • ప్రాథమిక విద్యలో తెలుగును తప్పనిసరి చేయాలని కోరతాం

  • ప్రపంచ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు ఇందిరాదత్‌

  • నేటి నుంచి హైదరాబాద్‌లో 3 రోజుల పాటు మహాసభలు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులనూ ఆహ్వానించామని ఆ సంస్థ అధ్యక్షురాలు, ప్రముఖ పారిశ్రామికవేత్త డాక్టర్‌ వీఎల్‌ ఇందిరాదత్‌ తెలిపారు. తెలుగు భాష, సంస్కృతి, కళలు, చరిత్ర పరిరక్షణ ధ్యేయంగా ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిపే ఈ మహాసభలను ఈసారి హైదరాబాద్‌లో నిర్వహిస్తుండడం సంతోషంగా ఉందని చెప్పారు. హెచ్‌ఐసీసీలోని హోటల్‌ నోవొటెల్‌ వేదికగా జరిగే మహాసభల్లో మొదటి రోజు శుక్రవారం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చేతుల మీదగా అంకుర సంస్థలను ప్రోత్సహించేలా లిటిల్‌ ఏంజెల్స్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.


చివరి రోజు ఆదివారం సాయంత్రం ముగింపు కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ఆహ్వానించామని చెప్పారు. ప్రాథమిక విద్యా బోధనలో తెలుగును తప్పనిసరి చేయమని ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులకు తమ వేదిక ద్వారా విన్నవిస్తామని తెలిపారు. మాతృభాషలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం లాంటి విషయాలమీద ఆలోచనలను రేకెత్తించాలన్నదే తమ ప్రధాన ఉద్దేశమని చెప్పారు. తెలుగు జీవ భాష కావాలంటే మన భాషలో ఉద్యోగ అవకాశాలు పెరగాలన్నారు. దీని కోసం మహాసభల్లో వ్యాపారవేత్తలు, పారిశ్రామిక దిగ్గజాలను భాగస్వాములను చేస్తున్నామని తెలిపారు.

Updated Date - Jan 03 , 2025 | 04:41 AM