ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: మీ బిల్డింగ్‌ను ముందే చూడొచ్చు..

ABN, Publish Date - Feb 07 , 2025 | 09:47 AM

భవన నిర్మాణ అనుమతులతో పాటు ప్లాన్‌ వివరాలు పందుపరిస్తే.. మీ భవనం ఎలా ఉండబోతుందో కళ్లముందు కనిపిస్తుంది. రోడ్డు, సెట్‌బ్యాక్‌, మెట్లు, లిఫ్ట్‌, గదులు.. ఇలా అన్నింటినీ డిజిటల్‌గా వీక్షించవచ్చు.

- ప్లాన్‌ వివరాలు పొందుపరిస్తే డిజిటల్‌గా ప్రత్యక్షం

- త్వరలో అందుబాటులోకి ఆగ్మెంటెడ్‌ రియాల్టీ టెక్నాలజీ

- ‘బిల్డ్‌ నౌ’ పేరుతో ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌

హైదరాబాద్‌ సిటీ: భవన నిర్మాణ అనుమతులతో పాటు ప్లాన్‌ వివరాలు పందుపరిస్తే.. మీ భవనం ఎలా ఉండబోతుందో కళ్లముందు కనిపిస్తుంది. రోడ్డు, సెట్‌బ్యాక్‌, మెట్లు, లిఫ్ట్‌, గదులు.. ఇలా అన్నింటినీ డిజిటల్‌గా వీక్షించవచ్చు. ఇందుకోసం త్వరలోనే ఆగ్మెంటెడ్‌ రియాల్టీ టెక్నాలజీని ప్రభుత్వం తీసుకురాబోతోంది. ఇప్పటి వరకు ప్రైవేట్‌ రంగానికే పరిమితమైన ఈ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం ‘బిల్డ్‌ నౌ’ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌ను పరిచయం చేయనున్నారు. ఈ మేరకు అధికారులు కార్యాచరణను రూపొందించారు. సాధారణంగా భవన నిర్మాణ అనుమతులు వచ్చిన తర్వాత అందులో పేర్కొన్న నిబంధనల ఆధారంగా భవన నిర్మాణం చేస్తారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: 3 తుపాకులకు రూ.6 లక్షలు...


అయితే తాజాగా బిల్డ్‌నౌ ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫామ్‌లో భవన అనుమతుల ప్లాన్‌ వివరాలు పొందుపరిస్తే ముందస్తుగానే నిర్మించే భవనాన్ని వీక్షించుకోవచ్చు. డిజిటల్‌గా వచ్చే చిత్రంలో భవనం, రోడ్డు, సెట్‌ బ్యాక్‌, మెట్లు, లిఫ్టు, గదులు, వాటి వెడల్పు ఇలా అన్నీ వివరాలు సమగ్రంగా ఉండనున్నాయి. మారుతున్న కాలానికనుగుణంగా భవన నిర్మాణ అనుమతుల్లో సాంకేతికతను జోడించారు. పదేళ్లుగా సాగుతున్న ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేసేవిధంగా ప్లానింగ్‌ విభాగం అధికారులు చర్యలు చేపట్టారు.


దేశంలోనే తొలిసారిగా భవన నిర్మాణ అనుమతులు ఆన్‌లైన్‌లో జారీ చేసే ప్రక్రియను హెచ్‌ఎండీఏ(HMDA)లో చేపట్టారు. ప్రస్తుతం బిల్డ్‌నౌ అనే ఆన్‌లైన్‌ విధానాన్ని తీసుకొచ్చారు. ఇది రాష్ట్రంలో భవన నిర్మాణ, లేఅవుట్‌ అనుమతుల ప్రక్రియను అత్యంత వేగవంతం చేయనుందని, రియల్‌ ఎస్టేట్‌ రంగానికి డిజిటల్‌ సామర్థ్యంలో కొత్త శకాన్ని తీసుకువస్తుందని ప్లానింగ్‌ అధికారులు అభిప్రాయపడుతున్నారు.


గేజ్‌ ఛేంజర్‌గా నిలుస్తుంది..

హెచ్‌ఎండీఏలో ప్లానింగ్‌ అధికారులు, ఉద్యోగులు, ఆర్కిటెక్ట్‌లకు బిల్డ్‌నౌ ప్లాట్‌ఫామ్‌పై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. హెచ్‌ఎండీఏ డైరెక్టర్లు విద్యాధర్‌, రాజేంద్రప్రసాద్‌ నాయక్‌లు బిల్డ్‌నౌలో అగ్మెంటెడ్‌ రియాల్టీతో వీక్షించే విధానాన్ని ఆసక్తిగా పరిశీలించారు. బిల్డ్‌నౌ ఏ వేగంతో పనిచేస్తుందో.. ఏ స్థాయిలో సమయాన్ని తగ్గిస్తుందో సాంకేతిక నిపుణులు వివరించారు. సాంకేతిక సమస్యలు లేకుండా అధునాతనంగా తీర్చిదిద్ధామని, ఇదో గేజ్‌ ఛేంజర్‌గా నిలుస్తుందని తెలిపారు. భవన నిర్మాణ అనుమతులు ఇచ్చిన తర్వాత అగ్మెంటెడ్‌ రియాల్టీతో జోడిస్తామని, దీంతో వినియోగదారులు, అధికారులు అనుమతుల తర్వాత విజవల్స్‌ను రియాల్టీలో వీక్షించుకునే వెసులుబాటు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. బిల్డ్‌నౌ డిజిటల్‌ వేదిక త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు

ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్‌ ఎన్నికలకే మొగ్గు

ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర

ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి

Read Latest Telangana News and National News

Updated Date - Feb 07 , 2025 | 09:47 AM