చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN, Publish Date - Apr 03 , 2025 | 01:05 PM
భారత్ చైనా దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏనుగు, డ్రాగన్ తరహాలో ఇరుదేశాల సంబంధాలు ఎదగాలని, బలోపేతం కావాలని అనడమే కాక.. శాంతియుతంగా ఉండేందుకు మార్గాలను అన్వేషించుకోవాలని, సంప్రదింపులు, సమన్వయాన్ని పెంచుకోవాలని, కలిసి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు.
భారత్ (India), చైనా (China) దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు పూర్తి అయిన సందర్బంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ (Xi Jinping) ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఏనుగు (Elephant), డ్రాగన్ (Dragon) తరహాలో ఇరుదేశాల సంబంధాలు ఎదగాలని, బలోపేతం కావాలని అనడమే కాక.. శాంతియుతంగా ఉండేందుకు మార్గాలను అన్వేషించుకోవాలని, సంప్రదింపులు, సమన్వయాన్ని పెంచుకోవాలని, కలిసి పనిచేయాలని ఆయన ఆకాంక్షించారు. రెండు దేశాలూ పురాతన నాగరికతలనీ.. అభివృద్ధి చెందుతున్నాయని, ఆదునికీకరణలో కీలకదశలో ఉన్నాయని ఆ దేశ విదేశాంగశాఖ ప్రతినిధి కూడా సానుకూల వ్యాఖ్యలు చేశారు. భారత రాష్ట్రపతి ప్రధాని మోదీ సయితం తమ సందేశాల్లో తత్సంబంధాలను ఆకాంక్షించారు. పరస్పర విశ్వాసాన్ని కలిగించే చర్యలు, నమ్మకమైన నడవడిక సంబంధాలను బలోపేతం చేస్తాయన్నారు. భారత్, చైనా బంధం కేవలం ఈ రెండు దేశాల సుస్థిరాభివృద్ధికి మాత్రమే కాక.. మితగా ప్రపంచం క్షేమానికి, సంక్షేమానికి అవసరమని ఉభయ దేశాల నేతలు ఈ సందేశాల్లో అభిప్రాయపడ్డారు.
Also Read..: టీటీడీకి విరాళాల వెల్లువ..పది రోజులలో ఎంతంటే..
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టు విచారణ
ఎండాకాలంలో ఐస్‌క్రీమ్స్ తినడం సురక్షితమేనా..
పిల్లలను పుస్తకాల పురుగులుగా మార్చే టిప్స్..
For More AP News and Telugu News
Updated at - Apr 03 , 2025 | 01:05 PM