వారికి మంత్రి పదవి ఇవ్వండి.. జానారెడ్డి లేఖ

ABN, Publish Date - Apr 01 , 2025 | 03:13 PM

Janareddy Letter: హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేల తరపున ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు సీనియర్ నేత జానా రెడ్డి లేఖ రాశారు.

హైదరాబాద్, ఏప్రిల్ 1: ఏఐసీసీ చీర్ ఖర్గే (AICC Chief Kharge), కేసీ వేణుగోపాల్‌కు (KC Venugopal) మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి (Congress Senior Leader Janareddy) లేఖ రాశారు. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు మంత్రి పదవి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల ఎమ్మెల్యల తరుపున ఏఐసీసీకి వినతి చేశారు. ఈ రెండు జిల్లాలకు మంత్రి పదవి ఇవ్వడం ద్వారా పార్టీకి లాభమని లేఖలో జానారెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రంగారెడ్డికి ఐదు నుంచి ఆరుగురు మంత్రులు ఉండేవారని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరు కూడా మంత్రిగా లేనటువంటి నేపథ్యంలో హైదరాబాద్, రంగారెడ్డి నుంచి ఒక్కొక్కరినైనా మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఏఐసీసీ చీఫ్ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు జానారెడ్డి.


కాగా.. మంత్రివర్గ విస్తరణ ఆలస్యం కొద్దీ ఆశావాహుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటికే పలు సామాజికవర్గాలు తమ సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి మంత్రి పదవి ఇవ్వాలని లేఖలు రాసిన విషయం తెలిసిందే.


ఇవి కూడా చదవండి

Crime News: హైదరాబాదులో విదేశీయురాలిపై దారుణం..

Ponnam Prabhakar Farmers: వాటిని కొనేందుకు ప్రభుత్వం సిద్ధం

Read Latest Telangana News And Telugu News

Updated at - Apr 01 , 2025 | 03:13 PM