బంపర్ ఆఫర్.. రూపాయికే డ్రెస్.. ఎక్కడో తెలుసా
ABN, Publish Date - Apr 07 , 2025 | 07:07 PM
హైదరాబాద్‌లో ఓ బట్టల షాప్ షో రూం యాజమాన్యం చేసిన మార్కెటింగ్ స్టంట్ వారికే బెడిసి కొట్టింది. యువకుల దెబ్బకు యాజమాన్యానికి దేవుడు కనిపించాడు.
హైదరాబాద్‌లో ఓ బట్టల షాప్ షో రూం యాజమాన్యం చేసిన మార్కెటింగ్ స్టంట్ వారికే బెడిసి కొట్టింది. యువకుల దెబ్బకు యాజమాన్యానికి దేవుడు కనిపించాడు. సైదాబాద్ సింగరేణి కాలనీలోని మెయిన్ రోడ్డుపై ఓ బట్టల షాప్ ప్రారంభమై ఏడాది ముగిసింది.
ఈ క్రమంలో షోరూంను ప్రమోట్ చేసుకోడానికి మార్కెటింగ్ స్టంట్‌లో భాగంగా ఓ బిగ్ ఆఫర్ ప్రకటించారు. కేవలం రూపాయికే డ్రస్ అని ప్రకటించారు. ఈ వార్త తెలియగానే యువకులు భారీ సంఖ్యలో ఆ షాపు దగ్గరకు చేరుకుని డ్రస్సుల కోసం ఎగబడ్డారు. తోసుకుని మరీ షాపులోకి వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో వారిని అదుపు చేయడానికి షాపు సిబ్బంది వల్ల కాలేదు. పోలీసులు వచ్చిన వారిని అదుపు చేయలేకపోయారు. చివరకు పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసుల సహాయంతో ఆ షాపును మూసివేశారు.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
Mega Health Hub: ఆరోగ్య రంగంలో సంస్కరణలు.. చంద్రబాబు విజన్ ఇదే
Pawan Visit Alluri District: అప్పుడు చెప్పా.. ఇప్పుడు సాకారం
Prabhavati Investigation: విచారణకు వచ్చిన ప్రభావతి.. కానీ
YS Sharmila Criticizes AP Govt: నిలిచిన వైద్య సేవలు.. సర్కార్‌పై షర్మిల ఫైర్
Read Latest AP News And Telugu News
Updated at - Apr 07 , 2025 | 07:53 PM