AP Weather Report: బీ అలర్ట్.. ఏపీలో తీవ్ర వడగాల్పులు
ABN, Publish Date - Apr 12 , 2025 | 10:01 AM
Heatwave Alert: ఏపీ వ్యాప్తంగా 66 మండలాల్లో ఇవాళ(శనివారం) వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు సాధ్యమైనంతా వరకు ఎండకు దూరంగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
ఏపీ వ్యాప్తంగా 66 మండలాల్లో ఇవాళ(శనివారం) వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ప్రజలు సాధ్యమైనంతా వరకు ఎండకు దూరంగా ఉండాలని, ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎక్కువగా తాగునీరు, గ్లూకోజ్, నిమ్మరసం, కొబ్బరినీరు, ఓఆర్‌ఎస్ వంటివి తీసుకోవాలని చెప్పింది.
కృష్ణాజిల్లా గన్నవరం, కంకిపాడు, పెద్దపాడి పూడి, ఉంగటూరు, ఉయ్యూరు మండలాల్లో వడగాల్పుల ప్రభావం అధికంగా ఉంటుందని తెలిపింది. అల్లూరి , కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశంలోని పలు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నెల 13వ తేదీన పదిమండలాల్లో తీవ్రంగా, 108 మండలాల్లోస్వల్పంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
మరిన్ని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...
ఈ వార్తలు కూడా చదవండి
AP free gas cylinders: సిలిండర్ బుక్ చేసినా సబ్సిడీ జమ కాలేదా
Vanajeevi Ramaiah: పద్మశ్రీ వనజీవి రామయ్య కన్నుమూత .. ప్రముఖుల సంతాపం
Read Latest AP News And Telugu News
Updated at - Apr 12 , 2025 | 10:05 AM